kumaram bheem asifabad- నిరసనల మధ్య మున్సిపల్ సర్వసభ్య సమావేశం
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:11 PM
కాగజ్‌నగర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం శనివారం సర్వసభ్య సమావేశం మందిరంలో మున్సిపల్ చైర్ పర్సన్ షాహీన్ సుల్తాన అధ్యక్షతన నిర్వహించారు. అధికారులు ఏజెండా చదివి విన్పించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పలువురు మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ అనితకు చైర్‌పర్సన్ పక్కన సీటు కేటాయించాలని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు అధికారులతో వాదనకు దిగారు.
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం శనివారం సర్వసభ్య సమావేశం మందిరంలో మున్సిపల్ చైర్ పర్సన్ షాహీన్ సుల్తాన అధ్యక్షతన నిర్వహించారు. అధికారులు ఏజెండా చదివి విన్పించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పలువురు మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ అనితకు చైర్‌పర్సన్ పక్కన సీటు కేటాయించాలని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు అధికారులతో వాదనకు దిగారు. ఎంతకు స్పందించక పోవటంతో నేలపైన్నే కూర్చొని నిరసన తెలిపారు. పదినిమిషాల్లోనే సమావేశం ముగించారు. అనంతరం బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ ప్రాంగణానికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎంపికైన డాక్టర్ అనితకు సమావేశ మందిరంలోని చైర్‌పర్సన్‌కు పక్కనే సీటు ఇవ్వక పోవడం దారుణమన్నారు. ఇది అమానించినట్టేనని చెప్పారు. గత రెండు పాలక వర్గాల్లో కూడా మున్సిపల్ చైర్‌పర్సన్ పక్కనే సీటు ఏర్పాటు చేసినట్టు ఫొటోలను సైతం చూపించారు. అధికార పార్టీ ఉందని ఇలాంటి తప్పిదాలు చేస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. న్యాయం చేయాలన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పక్కనే సీటు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాగా మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి వెళ్లేందుకు పాత్రికేయలు ప్రయత్నించగా అనుమతి లేదని అధికారులు తేల్చి చెప్పారు. సర్వసభ్య సమావేశం అయ్యేంత వరకు బయటనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పలువురు మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛను హరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. మున్సిపల్‌లో జరిగే అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.