నేడే మునిసిపల్ ఎన్నికలు...
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:08 PM
మునిసిప ల్ ఎన్నికలకు ఏర్పాట్లు సర్వం సిద్ధంగా ఉన్నాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూర్, క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలలో ఎన్నికలు జ రగనున్నాయి.
-ఉదయం 7 నుంచి 5 గంటల వరకు పోలింగ్
-ఐదు మునిసిపాలిటీల్లో 2.94 లక్షల మంది ఓటర్లు
-మొత్తం 444 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
-ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
మంచిర్యాల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మునిసిప ల్ ఎన్నికలకు ఏర్పాట్లు సర్వం సిద్ధంగా ఉన్నాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూర్, క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలలో ఎన్నికలు జ రగనున్నాయి. మంచిర్యాల కార్పొరేషన్‌కు సంబంధిం చి ముల్కల్లలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో డిస్ట్రి బ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయగా, బెల్లంపల్లి ముని సిపాలిటీలోని బజార్ ఏరియాలోగల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చెన్నూరు మునిసిపాలిటీలోని అట వీశాఖ సమీపంలోని జడ్పీ హై స్కూల్, క్యాతనపల్లి మునిసిపాలిటీలోని ఆర్‌కేసీఓఏ క్లబ్, లక్షెట్టిపేట ముని సిపాలిటీలో పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏ ర్పాటు చేసి, వివిధ బల్దియాల పరిధిలో ఏర్పాటు చే సిన పోలింగ్ కేంద్రాలకు తరలించారు. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలె క్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి మంచిర్యాల కా ర్పొరేషన్‌కు 265 బృందాలు, బెల్లంపల్లికి 68, చెన్నూ రుకు 36, క్యాతనపల్లికి 45, లక్షెట్టిపేటకు 30 బృందా ల చొప్పున సిబ్బందిని కేటాయించారు. వీరిలో మంచి ర్యాలకు సంబంధింది పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్, తదితరులు 1475 మంది ఉండగా, జోనల్ అధికారులు 10 మంది, మైక్రో అబ్జర్వర్లు 10 మంది ఉన్నారు.
మొత్తం 444 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు...
జిల్లాలోని మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు ఎన్నికలు జరుగనున్న లక్షెట్టిపేట, చెన్నూర్, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీలలో ఓటింగ్ కోసం మొత్తం 444 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్ల ఇంటి నుంచి కనీసం అర కిలోమీటరు నుంచి గరిష్టంగా ఒక కిలోమీటర్ లోపు పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయా లు, ప్రభుత్వ పాఠశాల భవనాలతోపాటు కొన్ని చోట్ల ప్రైవేటు పాఠశాలల భవనాల్లోనూ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంధ్రంలో గరిష్టంగా 800 మంది ఓటర్లను కేటాయించారు. మంచిర్యాల కార్పొరే షన్‌లో 265 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, లక్షెట్టిపేటలో 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. చెన్నూర్‌లో 36 కేంద్రాలు, క్యాతన్‌పల్లిలో 45 స్టేషన్లు, బెల్లంపల్లి మున్సిపాలిటీలో 68 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మునిసిపాలిటీల వారీగా ఓటర్ల వివరాలు...
బల్దియా వార్డులు మొత్తం పురుషులు స్త్రీలు ఇతరులు
మంచిర్యాల 60 1,81,778 90,646 91,111 21
బెల్లంపల్లి 34 44,575 21,560 23,012 03
క్యాతన్‌పల్లి 22 29,785 14,761 15,023 01
చెన్నూరు 18 19,903 9711 10,191 01
లక్షెట్టిపేట 15 18,358 8780 9577 01
............. ................... ................. .............. .....
మొత్తం 149 2,94,399 1,45,458 1,48,914 27
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు...
మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌శాఖ ఆధ్వ ర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డీసీ పీ ఎగ్గడి భాస్కర్ నేతృత్వంలో 800 పై చిలుకు సి బ్బందితో ఎన్నికల బందోబస్తు నిర్వహించనున్నారు. జి ల్లాలోని ఐదు మునిసిపాలిటీల పరిధిలో ఏసీపీలు 06, సీఐలు 13, ఎస్‌ఐలు 33, ఏఎస్‌ఐలు/హెడ్ కానిస్టే బు ళ్లు 119, కానిస్టేబుళ్లు 375, హోంగార్డులు 166, ఆర్మ్‌డ్ సిబ్బంది 140, క్యూఆర్‌టీ టీమ్స్, రూట్ మొబైల్ పార్టీ లు, ఇతర డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన 100 మం ది ఎన్నికల బందోబస్తులో పాల్గొననున్నారు. జిల్లాలోని మొత్తం 444 పోలింగ్ బూత్‌ల పరిధిలో మొత్తం 179 సెంటర్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వాటి లో మంచిర్యాల పరిధిలో 110 బూత్‌లు ఉండగా, లక్షె ట్టిపేటలో 08, చెన్నూరులో 22, బెల్లంపల్లిలో 22, క్యా తన్‌పల్లిలో 17 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. జిల్లా వ్యా ప్తంగా ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 163 బీఎన్‌ఎస్ సెక్షన్ అమలులో ఉండనుంది. పోలింగ్ బూత్ చు ట్టుపక్కల ప్రచారం నిర్వహించడం, పార్టీల సింబ ల్స్‌గల దుస్తులు ధరించడం, కరపత్రాలతో సంచరించడం, ఏరకంగానూ ఓటర్లను ప్రలోభ పెట్ట డం, దూర ప్రాంత ఓటర్లకు అభ్యర్థులు ట్రాన్స్‌పోర్టింగ్ సౌకర్యం కల్పించడాన్ని నిషేధించారు.