Minister Adluri: త్వరలో మునిసిపల్ నగారా!: అడ్లూరి
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:42 AM
రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనుందని, ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ....
రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనుందని, ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వైఖరిపై ధ్వజమెత్తారు. సభలో ఉండి ప్రజా సమస్యలపై కొట్లాడాలని మామ చెబితే.. అల్లుడు సభ నుంచి పారిపోయాడంటూ బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును ఉద్దేశించి మంత్రి ఎద్దేవా చేశారు. చర్చను ఎదుర్కోలేకనే వారు పలాయనం చిత్తగించారన్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై చర్చ జరిగితే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందనే భయం బీఆర్‌ఎస్ సభ్యుల్లో నెలకొందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. నీళ్లపై చర్చ అనగానే వారికి వణుకు పుట్టిందన్నారు. రెండేళ్లుగా ప్రజలు వారి వ్యవహారశైలిని గమనిస్తున్నారని, కేవలం తమ పంతం నెగ్గించుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుతం ఖతమయ్యే దశకు చేరుకుందని, ఉనికిని కాపాడుకునే పోరాటంలో ఉన్నదని మంత్రి వ్యాఖ్యానించారు. తమ తప్పులు ఉంటే అసెంబ్లీలో నిరూపించాలని, దమ్ముంటే చర్చకు రావాలని బీఆర్‌ఎ్‌సకు ఆయన సవాల్ విసిరారు. .