Share News

28న మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌!

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:15 AM

రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకొని ఈ నెల 28న మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

28న మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌!

  • ఏర్పాట్లలో నిమగ్నమైన ఎస్‌ఈసీ.. 27న సమావేశం

హైదరాబాద్‌, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకొని ఈ నెల 28న మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 27న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి.. అదే రోజు లేదంటే మరుసటి రోజు 28న షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్‌ కేంద్రాల ఎంపిక, సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తిచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ).. అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణీ కుముదిని వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షిస్తున్నారు. పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల ఎంపిక వంటి కీలక అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. ఈ నెల 24న ఎన్నికల సాధారణ పరిశీలకులతో సమావేశం కానున్నారు. విధి విధానాలు, నిబంధనలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. 27న ఎస్‌ఈసీ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అదే రోజు లేదా మరుసటి రోజు 28న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసేందుకు ఎస్‌ఈసీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Updated Date - Jan 23 , 2026 | 04:15 AM