Share News

kumaram bheem asifabad- మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశం రసాభాస

ABN , Publish Date - Mar 31 , 2026 | 10:36 PM

మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ గజానంద్‌ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన బడ్జెట్‌ సమావేశం రసాభాసగా కొనసాగింది. తమకుకనీసం మర్యాద ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ కౌన్సిల ర్లు అబ్దుల్లా, కార్తీక్‌, వినోద్‌, గోవింద్‌, తారాబాయి, పుష్పలత, భారతి, భాగ్యలక్ష్మి, కృష్ణమ్మ, స్వప్నరాణి నిరసన వ్యక్తం చేసి సమావేశాన్ని బహిష్కరించారు. కాగా మొదటి బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలిచిన పది మంది కౌన్సిలర్లం హాజరైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. కమిషనర్‌ గజానంద్‌ తీరుపై కౌన్సిలర్లు మండి పడ్డారు. కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఖర్చయే చోట నాలుగు లక్షలు ఖర్చు చేసినట్లు చూపి చైర్మన్‌ గది సిద్ధం చేశారని, కానీ దానిలో సమావేశం పెట్టక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

kumaram bheem asifabad- మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశం రసాభాస
నేలపై కూర్చొని నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్‌ కౌన్సిలర్లు

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ గజానంద్‌ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన బడ్జెట్‌ సమావేశం రసాభాసగా కొనసాగింది. తమకుకనీసం మర్యాద ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ కౌన్సిల ర్లు అబ్దుల్లా, కార్తీక్‌, వినోద్‌, గోవింద్‌, తారాబాయి, పుష్పలత, భారతి, భాగ్యలక్ష్మి, కృష్ణమ్మ, స్వప్నరాణి నిరసన వ్యక్తం చేసి సమావేశాన్ని బహిష్కరించారు. కాగా మొదటి బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలిచిన పది మంది కౌన్సిలర్లం హాజరైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. కమిషనర్‌ గజానంద్‌ తీరుపై కౌన్సిలర్లు మండి పడ్డారు. కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఖర్చయే చోట నాలుగు లక్షలు ఖర్చు చేసినట్లు చూపి చైర్మన్‌ గది సిద్ధం చేశారని, కానీ దానిలో సమావేశం పెట్టక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ నిబంధనలు కనీసం పాటించడం లేదన్నారు. బడ్జెట్‌ ఎజెండా కూడా తమతో చర్చించలేదని తెలిపారు. మొదటి సమావేశంలో కమిషనర్‌ అవగాహన లేకుండా వ్యవహరించడంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

వేచి చూసినా కాంగ్రెస్‌ కౌన్సిలర్లు..

కాంగ్రెస్‌ కౌన్సిలర్లు లేకుండా సమావేశం ప్రారంభించడంతో కొద్ది సేపు కార్యాలయం ఎదుట అనంతరం కమిషనర్‌ గదిలో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఎదురు చూశారు. కమిషనర్‌ గదిలో కుర్చీలు కూడా లేక పోవడంతో కౌన్సిలర్లు నిలబడి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి సమావేశ గదిలోకి వెళ్లి తమకు కనీసం మర్యాద ఇవ్వలేదని నేలపై కూర్చొని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి సమక్షంలో నిరసన తెలిపారు. కాగా కమిషనర్‌ తీరుపై మండి పడ్డ కాంగ్రెస్‌ కౌన్సిలర్లు చివరకు మొదటి బడ్జెట్‌ సమావేశాన్ని బహిష్కరణతో ముగించారు. బడ్జెట్‌ సమావేశాల్లో కేవలం చైర్మన్‌కు మాత్రమే ప్రత్యేక కుర్చీ వేయాల్సిన కమీషనర్‌ వైస్‌ చైర్మన్‌కు కూడా కుర్చీ వేయడం ఏంటని ప్రశ్నించారు. చైర్మన్‌ గదిలో ఎమ్మెల్యే ఫొటోపై మార్చి 6వ తేదీన కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రభుత్వానికి నివేదించి నిర్ణయం తీసుకుంటామని కమిషనర్‌ చెప్పారని అన్నారు. దానిపై ఏ నిర్ణయం తీసుకోక పోవడం బాధకరమన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్ల పరిస్థితి ఇలా ఉంటే మున్సిపాలిటీలో అభివృద్ధి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటూ ఎద్దేవా చేశారు. కాగా సమావేశం బహిష్కరణ తరువాత కౌన్సిలర్లు నేరుగా వెళ్లి జిల్లా కలెక్టర్‌ కె హరితకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చినట్లు తెలిపారు.

బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం..

కొత్తగా ఏర్పడిన ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ ప్రథమ బడ్జెట్‌ రూ.37.80 కోట్లతో కౌన్సిల్‌ ఆమోదించింది. మున్సిపాలిటీగా ఆవిర్భావించిన తరువాత ఎన్నికలు జరిగి పూర్తి కౌన్సిలర్‌ ఆధ్వర్యంలో మొదటి బడ్జెట్‌ సమావేశాలు పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, కమిషనర్‌ గజానంద్‌, కౌన్సిలర్లు హాజరయ్యారు. కాంగ్రెస్‌ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించడంతో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతోనే మున్సిపల్‌ ప్రథమ బడ్జెట్‌ రూ.37.80 కోట్లతో కౌన్సిల్‌ ఆమోదించింది.

Updated Date - Mar 31 , 2026 | 10:36 PM