కొత్త క్రిమినల్ చట్టాల అమలులో ములుగు జిల్లా టాప్
ABN , Publish Date - Oct 09 , 2026 | 04:03 AM
రాష్ట్రంలో కొత్త క్రిమినల్ చట్టాల అమలులో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
హైదరాబాద్, మల్కాజ్‌గిరి, నిజామాబాద్, కరీంనగర్ మెరుగుపడాలి
విభాగాల పనితీరుపై
డీజీపీ ఆనంద్ ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త క్రిమినల్ చట్టాల అమలులో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో జయశంకర్ భూపాలపల్లి, రామగుండం కమిషనరేట్‌లు ఉన్నాయి. కాగా మల్కాజ్‌గిరి, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ కమిషనరేట్లు పనితీరు మెరుగుపరుచుకోవాలని డీజీపీ ఆనంద్ సూచించారు. మహబూబ్‌నగర్, జీఆర్‌పీ సికింద్రాబాద్, యాదాద్రి భువనగిరి కొత్త క్రిమినల్ చట్టాల అమలులో వెనుకబడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో నూతన క్రిమినల్ చట్టాల అమలు ర్యాంకింగ్‌లో తెలంగాణ స్కోరు 60.15గా ఉందని, జీరో ఎఫ్‌ఐఆర్, ఆన్‌లైన్ చార్జిషీట్, ఈ-సాక్ష్య, ఈ-సమన్లు మరింత సమర్థంగా అమలు చేేస్త రాష్ట్ర ర్యాంకింగ్‌ను గణనీయంగా మెరుగుపరుచుకోవచ్చని ఆయన సూచించారు. నూతన క్రిమినల్ చట్టాల అమలులో వెనుకబడిన పోలీసు యూనిట్ల ఎస్పీలు, కమిషనర్లతో సీఐడీ కార్యాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పనితీరులో మెరుగుదల సాధిేస్తనే జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు సాధ్యమవుతుందన్నారు. ఈగల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగాలు జాతీయ స్థాయిలో ఇప్పటికే అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గుర్తింపు సాధించాయని ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో సీఐడీ డైరెక్టర్ చారు సిన్హా, హైదరాబాద్ సీపీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ రమేష్, మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.