సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్‌గా ముకుందరెడ్డి బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:54 AM
సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌గా జి.ముకుందరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా ...
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌గా జి.ముకుందరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా సేవలు అందించిన ఆయన్ను సమాచార శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన నూతన బాధ్యతలను చేపట్టారు. ప్రత్యేక కమిషనర్‌తో పాటు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు.