Share News

త్యాగానికి, సహనానికి ప్రతీక మొహర్రం: సీఎం రేవంత్‌

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:26 AM

త్యాగనిరతి, అనిర్వచనీయ సహనానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహమ్మద్‌ ప్రవక్త మనుమడు...

త్యాగానికి, సహనానికి ప్రతీక మొహర్రం: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): త్యాగనిరతి, అనిర్వచనీయ సహనానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహమ్మద్‌ ప్రవక్త మనుమడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానాన్ని స్మరించుకుంటూ మొహర్రం జరుపుకొంటారని గుర్తు చేశారు. తరతరాలుగా తెలంగాణ గ్రామాల్లో హిందూ-ముస్లింలు కలిసి పీర్ల ఊరేగింపు నిర్వహిస్తారని.. ఇది గంగా జమునా తెహజీబ్‌ విధానానికి గొప్ప నిదర్శనమని కొనియాడారు. హిందూ-ముస్లిం సోదరులంతా ఐక్యంగా, శాంతియుతంగా పీర్ల ఊరేగింపు నిర్వహించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు. కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య సఖ్యతకు, ఐక్యతకు వారధిగా మొహర్రం నిలుస్తుందని పేర్కొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 04:26 AM