Share News

kumaram bheem asifabad- ఘనంగా మొహర్రం ఉత్సవాలు

ABN , Publish Date - Jun 26 , 2026 | 10:29 PM

జిల్లాలోని పలు మండలాల్లో మొహర్రం ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వాంకిడి మండలంలోని ఖమన, వాంకిడి, బంబార, ఇంధాని తదితర గ్రామాల్లో ఏర్పాలు చేసిన పీరీల బంగ్లాల వద్ద ప్రజలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

kumaram bheem asifabad- ఘనంగా మొహర్రం ఉత్సవాలు
వాంకిడిలో పీర్లకు ఊరేగింపు నిర్వహిస్తున్న భక్తులు

వాంకిడి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో మొహర్రం ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వాంకిడి మండలంలోని ఖమన, వాంకిడి, బంబార, ఇంధాని తదితర గ్రామాల్లో ఏర్పాలు చేసిన పీరీల బంగ్లాల వద్ద ప్రజలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మొహరం పండుగ సందర్బంగా తొమ్మిది రోజుల పాటు ఉన్న ఉపవాసాలను భక్తులు విరమించారు. భాజా భజంత్రీలతో పీర్లను గ్రామ వీధుల్లో ఊరేగిస్తు సమీప చికిలి వాగులో నిమజ్జనం చేశారు. మొహర్రం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ వేణుగోపాల్‌, ఎస్సై మహేందర్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలం పుంజుమేరగూడలో భువమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన మొహర్రం ఉత్సవాలు పదో రోజుతో ముగిశాయి. ఉదయం కత్తిదెబ్బ, గుండం తొక్కే కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం దేవుళ్ల ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమం జరుగనున్నట్టు ఆలయ కమిటి పేర్కొంది. మొహర్రం ఉత్సవాలకు సహరించిన వారికి అధ్యక్షుడు వినోద్‌ జైశ్వాల్‌ కృతజ్ఙతలు తెలిపారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ పట్టణంలోని శుక్రవారం మొహరం పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ అహ్మద్‌ మైనార్టీ నాయకులతో కలిసి షరబత్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు షబ్బీర్‌, షాకీర్‌, సాలం, నజీర్‌, అఖిల్‌, సర్ధార్‌, సాజిద్‌, మాజిద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి):మండలంలోని జన్కాపూర్‌, గుండి, గొడవెల్లి, తుంపల్లి, హడ్కోకాలనీ, రాజంపేటలో శుక్రవారం మొహర్రం ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక వంటకాలతో డప్పు సప్పుల నడుమ పండగను జరుపుకున్నారు. అనంతరం పీరీల మందిరం నుంచి పీరీలను నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేపట్టారు. కార్యక్రమంలో నిర్వహకులు హసెన్‌, రఫీక్‌, సుధాకర్‌, బాబా, నజీర్‌, జావీద్‌, బాబా, సతీష్‌, కుమార్‌, నజీర్‌ తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలో శుక్రవారం మొహర్రం ఉత్సవాలను ఘనంగా జరుపుకన్నారు. గోల్కొండ మసీద్‌ ఆధ్వర్యంలో షరబత్‌ పంపిణీ చేశారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా మొహర్రం ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - Jun 26 , 2026 | 10:29 PM