గ్రామీణ జీవనం ప్రతిబింబించేలా ముగ్గులు
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:26 PM
పల్లెటూ రి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సంక్రాంతి ముగ్గులు అద్భుతంగా చూ పించారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నా రు.
- మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి
కోడేరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : పల్లెటూ రి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సంక్రాంతి ముగ్గులు అద్భుతంగా చూ పించారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నా రు. ఆదివారం మండల పరి ధిలోని నర్సాయిపల్లి గ్రా మంలో సంక్రాంతి సంద ర్భంగా ముగ్గుల పోటీలు, క్రికెట్, ట్రాక్టర్ రివర్స్ పోటీలలో విజేతలకు బ హుమతులు అందజేశారు. ఆయన మాట్లాడు తూ ఇక్కడ వేసిన ముగ్గులు అన్ని మతాలతో కలిసిన భారత సంస్కృతిని ప్రతిబింబించేలా ఉ న్నాయని అన్నారు. ఆకాశంలో చుక్కలను నేల మీదకు దించి సమాజంలో అందరు కలిసి ఉండాలని సందేశాన్నిస్తూ వేసిన ముగ్గు ఎంతో అందంగా ఉందని అభిప్రాయపడ్డారు. కార్య క్రమంలో గ్రామ సర్పంచు ఎండీ ఖాజాబేగం, మాజీ సర్పంచులు సత్యంయాదవ్, ఎండీ అన్వర్, సింగిల్‌విండో మాజీ చైర్మన్ జంబుల బిచ్చారెడ్డి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.