Share News

లక్ష్యం చేరని ‘ముద్ర’ ..!

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:03 PM

చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక స్వావలంభనకు ఉపకరించే కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) జిల్లాలో నిర్ణయించిన మేరకు లక్ష్యం చేరలేదు. కొన్ని బ్యాంకర్ల సహాయ సహకారాలతో పథకం ముందుకు సాగుతుండగా, మరికొన్ని బ్యాంకర్లు మందకొడిగా రుణాలు మంజూరు చేస్తుండటంతో ఈ ఏడాది లక్ష్యానికి దూరంగా ఉంది.

లక్ష్యం చేరని ‘ముద్ర’ ..!

-గతేడాదితో పోల్చితే తగ్గిన రుణాల మంజూరు

-సీబిల్‌ పేరుతో బ్యాంకర్ల మెలికలు

-మొక్కుబడిగా రుణాలు ఇస్తున్న కొన్ని బ్యాంకులు

-స్థాయిని బట్టి రూ. 50వేల నుంచి రూ. 10 లక్షల వరకు అవకాశం

మంచిర్యాల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక స్వావలంభనకు ఉపకరించే కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) జిల్లాలో నిర్ణయించిన మేరకు లక్ష్యం చేరలేదు. కొన్ని బ్యాంకర్ల సహాయ సహకారాలతో పథకం ముందుకు సాగుతుండగా, మరికొన్ని బ్యాంకర్లు మందకొడిగా రుణాలు మంజూరు చేస్తుండటంతో ఈ ఏడాది లక్ష్యానికి దూరంగా ఉంది. అయితే జిల్లాలోని అన్ని బ్యాంకులు ముందుకు వచ్చి సకాలంలో రుణాలు మంజూరు చేస్తే వ్యాపారుల ఆర్థిక స్వావలంభనకు మ రింతగా తోడ్పాటు అందేది. కొన్ని బ్యాంకులు మొక్కుబ డిగా రుణాలు మంజూరు చేస్తుండటంతో ప్రభుత్వ పథ కం లక్ష్యం జిల్లాలో సంపూర్ణం కావడం లేదనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కుకొని బతుకులు బుగ్గిపాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులకు ఆర్థికంగా తోడ్పాడుటునందించే సదుద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజ న పథకాన్ని ప్రారంభించింది. సేవారంగం, ఉత్పత్తి రం గాలకు చెందిన వ్యాపారస్థులకు అవసరమైన రుణాలు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భా గంగా చిరు వ్యాపారులు సమీపంలోని బ్యాంకుల్లోనే ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం పొందే వెసులుబా టు కల్పించింది. అయితే జిల్లాలో మాత్రం ఈ పథకం ఆశించిన స్థాయిలో లక్ష్యం చేరడం లేదనే చెప్పాలి. ప లువురు బ్యాంకర్లు అర్హులైన వ్యాపారులకు రుణాలు పంపిణీ చేయడంలో అనవసరమైన మెలికలు పెడుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మూడు విభాగాల్లో రుణాలు మంజూరు....

ముద్ర యోజన పథకం కింద శిశు, కిషోర్‌, తరుణ్‌ విభాౄగాల్లో రైతులకు రుణాలు అందించాల్సి ఉంది. వీటిలో శిశు పథకం కింద రూ. 50వేలు, కిషోర్‌కు రూ. 5 లక్షలు, తరుణ్‌ కింద రూ. 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఆయా విభాగాల్లో అర్హతగల వ్యా పారులు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పొంది వ్యాపారాలను అభివృద్ది చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. అయితే కొన్ని చోట్ల బ్యాంకర్లు నిర్ణయించిన మేర కు పూర్తిస్థాయిలో రుణం మంజూరు చేయడం లేదని తెలుస్తోంది. శిశు పథకం కింద రూ. 50వేలు రుణం ఇవ్వాల్సి ఉండగా కొన్ని బ్యాంకులు మాత్రం రూ. 25వేల నుంచి 30వేల వరకే ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కిషోర్‌, తరుణ్‌ పథకాల్లోనూ అదే పద్ధతి అవలం భిస్తు న్నట్లు సమాచారం. జిల్లాలో అన్ని రకాల బ్యాంకుల శా ఖలు 28 వరకు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్స రం లో ఆయా బ్యాంకులు వ్యక్తిగతంగా గరిష్టంగా 12 శాతం మేర మాత్రమే రుణాలు మంజూరు చేశాయి. దీనికి సీబిల్‌ స్కోర్‌ ప్రధాన సమస్యగా మారినట్లు తెలుస్తోంది. గతంలో బ్యాంకుల్లో రుణాలు పొందిన వ్యాపారులు స కాలంలో నెలసరి వాయిదాలు సకాలంలో చెల్లించకపో వడంతో చాలా మంది వ్యాపారుల సీబిల్‌ స్కోరు పడి పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా వ్యాపారులకు తిరిగి రుణాలు మంజూరు చేసేందుకు కొన్ని బ్యాంకులు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.

అవగాహనలేమి కూడా కారణం...

చిరు వ్యాపారులకు సకాలంలో సులువుగా రుణాలు అందించే ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టిన ాప్రధాన మంత్రి ముద్ర యోజన్‌ పథకం పట్ల సరియైున అవగాహనలేక వ్యాపారుల నుంచి ఆశించినమేర స్పందన రావడంలేద ని తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతు న్న పథకాలపై ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం లేదని తెలుస్తోం ది. చిరు వ్యాపారులను ఆదుకొనే పీఎంఎంవై పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే మరింత ప్రయోజన కారిగా మారే అవకాశం ఉంది.

రుణాల మంజూరులో టీజీబీ సేవలు భేష్‌...

ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద వివిధ రంగాలకు చెందిన వ్యాపారులకు రుణాలు మంజూరు చేయడంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ (టీజీబీ) ముం దంజలో ఉంది. రుణాల విషయంలో వ్యాపారులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్న ఏకైక బ్యాంకుగా టీజీబీ పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంది. టీజీబీ బ్యాంకుకు బ్రాంచి కార్యాలయాలు అధికంగా ఉండటం తో ఎక్కడికక్కడే వ్యాపారులకు సేవలు అందుబాటులో ఉంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరం జిల్లాలోని అన్ని బ్యాంకుల శాఖలతో పోల్చితే టీజీబీ 58.09 కోట్ల రుణాల మంజూరుతో ముందంజలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 3092 మంది వ్యాపారులకు రూ. 58.09 కోట్ల రుణాలు మంజూరు చేసిన టీజీబీ అగ్రస్థానంలో నిలిచింది. అ యితే 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే దాదాపు రూ. 30 కోట్ల మేర వెనుకబడింది. గత ఏడాది రూ. 88 కోట్ల పైచిలుకు రుణాలు టీజీబీ మంజూరు చేసింది. అ యినప్పటికీ ఇతర బ్యాంకుతో పోల్చితే ఈ ఏడాది కూ డా రుణాల మంజూరులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు అగ్రస్థానంలో ఉండటం అభినందనీయం. ఆ తరువాత స్థానంలో 7834 ఖాతాలు కలిగి ఉన్న బంధన్‌ బ్యాంక్‌ రూ. 57.87 కోట్లు మంజూరు చేసి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆక్సిస్‌ బ్యాంకు 6886 ఖాతాలకు రూ. 34.79 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 642 ఖా తాలకు రూ. 14.15 కోట్లు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 605 ఖాతాలకు రూ. 13.49 కోట్లు, హెచడీఎఫ్‌సీ బ్యాంక్‌ 276 ఖాతాలకు రూ. 8.98 కోట్లు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 275 ఖాతాలకు రూ. 8.53 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ 96 ఖా తాలకు రూ. 4.29 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. మిగతా బ్యాంకులన్నీ రుణాల మంజూరులో వెనుకబడ టంతో జిల్లాలో ఈ ఏడాది లక్ష్యం నెరవేరలేదు.

Updated Date - Jul 02 , 2026 | 11:03 PM