Share News

దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంస్‌ఎంఈలు వెన్నెముక: మహేశ్‌ గౌడ్‌

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:34 AM

దేశ ఆర్థిక వ్యవస్థకు స్మూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంస్‌ఎంఈ) వెన్నెముక వంటివని, ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక అసమానతలను తగ్గించడంలో...

దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంస్‌ఎంఈలు వెన్నెముక: మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌/గోషామహల్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): దేశ ఆర్థిక వ్యవస్థకు స్మూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంస్‌ఎంఈ) వెన్నెముక వంటివని, ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక అసమానతలను తగ్గించడంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. ప్రపంచ ఎంస్‌ఎంఈ దినోత్సవం సందర్భంగా ఆలిండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ (ఏఐపీసీ) తెలంగాణ ఎంస్‌ఎంఈ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మీడియా ప్లస్‌ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంఎ్‌సఎంఈల అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొద్దిమంది చేతుల్లో సంపద కేంద్రీకృతం కావడం దేశాభివృద్ధికి మంచిది కాదని, చిన్న పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలు కల్పించి సమాన అవకాశాల సమాజాన్ని నిర్మించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో 3 నుంచి ఐదారుగురికి ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమలే ప్రధాన బలమన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 03:34 AM