రేపు ఎంఎస్‌ఎఫ్ జాతీయ సదస్సు
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:21 PM
అక్టోబరు 6న హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వ హించనున్న ఎంఎస్‌ఎఫ్ ప్రతినిధుల జాతీయ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆదివారం అచ్చంపేట పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎంఎస్‌ఎఫ్ ఉమ్మడి జి ల్లా ఇన్‌చార్జి బుక్కాపురం మహేష్ మాదిగ ఆ ధ్వర్యంలో ఆవిష్కరించారు.
- వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎంఎస్‌ఎఫ్ జిల్లా ఇన్‌చార్జి మహేష్ మాదిగ
అచ్చంపేట, అక్టోబరు 4 (ఆంధ్రజ్యో తి) : అక్టోబరు 6న హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వ హించనున్న ఎంఎస్‌ఎఫ్ ప్రతినిధుల జాతీయ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆదివారం అచ్చంపేట పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎంఎస్‌ఎఫ్ ఉమ్మడి జి ల్లా ఇన్‌చార్జి బుక్కాపురం మహేష్ మాదిగ ఆ ధ్వర్యంలో ఆవిష్కరించారు. మహేశ్ మాట్లా డుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఎమ్మార్పీ ఎస్ ఉద్యమానికి అనుబంధంగా ఎంఎస్‌ఎఫ్ అ నేక పోరాటాలు నిర్వహిస్తూ మాదిగ విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తోందన్నా రు. అచ్చం పేట నియోకవర్గంలోని అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో మాదిగ వి ద్యార్థులు తరలి వచ్చి జాతీయ సదస్సును విజ యవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చౌట కాశీం, శంకర్, బొల్లె నాగరాజు, రోడ్డ గణేష్ మాదిగ, కృష్ణ మాదిగ, అజయ్ మాదిగ, కరుణాకర్ మాదిగ, లక్ష్మేశ్వర్ మాదిగ, రాజు, ప్రశాంత్ మాదిగ పాల్గొన్నారు.