Share News

దళితులను అవమానించిన ఎంపీ

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:29 PM

దళితుడైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం అహర్ని శలు కృషి చేసిన తమ ఫొటోలను ఫ్లెక్సీలో పెట్టకపోవడం తమను అవమానించడమే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రా మగిరి బానేష్‌, కార్పొరేటర్‌ సుదమల్ల హరికృష్ణ అన్నారు.

దళితులను అవమానించిన ఎంపీ

మంచిర్యాలక్రైం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : దళితుడైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం అహర్ని శలు కృషి చేసిన తమ ఫొటోలను ఫ్లెక్సీలో పెట్టకపోవడం తమను అవమానించడమే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రా మగిరి బానేష్‌, కార్పొరేటర్‌ సుదమల్ల హరికృష్ణ అన్నారు. రెండు రోజుల క్రితం మంచిర్యాల పట్టణంలో పెద్దపల్లి ఎం పీ వంశీకృష్ణ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధుల ఫొ టోలు పెట్టకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్‌ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెంది న ప్రజాప్రతినిధుల ఫొటోలను ఫ్లెక్సీలో పెట్టకపోవడం సిగ్గు చేటన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో వంశీకృష్ణ గెలుపు కోసం ఎంతో కృషి చేశామని అయినా దళితులను పట్టించు కోకపోవడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Sep 20 , 2026 | 11:29 PM