సాక్షాత్తూ అన్నపూర్ణే డొక్కా సీతమ్మ
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:10 AM
అపర అన్నపూర్ణగా ప్రసిద్ధి గాంచిన డొక్కా సీతమ్మ నివాసంలోకి రాగానే ఒళ్లు పులకరించిందని సినీ రచయిత, ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్రప్రసాద్ అన్నారు
ఆమె నివాసంలోకి రాగానే ఒళ్లు పులకరించింది
ప్రముఖ సినీ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్
పి.గన్నవరం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): అపర అన్నపూర్ణగా ప్రసిద్ధి గాంచిన డొక్కా సీతమ్మ నివాసంలోకి రాగానే ఒళ్లు పులకరించిందని సినీ రచయిత, ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్రప్రసాద్ అన్నారు. ఆనాడు అడిగిన వారికి లేదనకుండా అన్నం పెట్టిన అన్నదాత సీతమ్మ నివాసాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. సాక్షాత్తూ అన్నపూర్ణ తల్లియే సీతమ్మగా వచ్చిందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకన్న, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను విజయేంద్రప్రసాద్ సోమవారం సందర్శించారు. వీటితోపాటు పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలోని డొక్కా సీతమ్మ నివాసాన్ని సందర్శించారు. స్థానిక పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి సీతమ్మ చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించారు.