Share News

ఎన్టీపీసీ విస్తరణలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:33 AM

రామగుండం ఎన్టీపీసీ విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎన్టీపీసీ చైర్మన్‌, ఎండీ గురుదీప్‌ సింగ్‌ను ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు.

ఎన్టీపీసీ విస్తరణలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి

  • ఎన్టీపీసీ చైర్మన్‌కు ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఎన్టీపీసీ విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎన్టీపీసీ చైర్మన్‌, ఎండీ గురుదీప్‌ సింగ్‌ను ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రాజెక్టుల వల్ల ప్రభావితం అవుతున్న మాతంగి కాలనీ వాసులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. అలాగే కార్మికులను రామగుండం కార్పొరేషన్‌ హోదాకు తగ్గట్లు ‘సి’ గ్రేడ్‌ నుంచి ‘బి’ గ్రేడ్‌కు అప్‌గ్రేడ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు ప్రతి మూడునెలలకోసారి కాకుండా ఏడాదికి ఒకసారి మెడికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలని, ప్రైవేట్‌ ఆస్పత్రుల సర్టిఫికెట్ల ఒత్తిడిని తొలగించాలని కోరారు. ఈ విజ్ఞప్తులపై గురుదీప్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించారని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.

Updated Date - Aug 05 , 2026 | 05:34 AM