Share News

హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లాలి

ABN , Publish Date - May 03 , 2026 | 05:13 AM

కళాశాలలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య ...

హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లాలి

  • సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య లేఖ

రాంనగర్‌, మే 2 (ఆంధ్రజ్యోతి) : కళాశాలలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య శనివారం లేఖ రాశారు. ఆ వివరాలను బీసీ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కోర్టు తీర్పుతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచి ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఫీజులు చెల్లించలేక, పై చదువులకు వెళ్లలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఫీజుల వసూలుకు సంబంధించి జారీ చేసిన జీవో నెంబరు 7ను ఉపసంహరించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎంను కోరామన్నారు. పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిలు 8 వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరామన్నారు. విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేయరాదని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని సీఎంను కోరామన్నారు.

Updated Date - May 03 , 2026 | 05:13 AM