Share News

బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం: ఆర్‌.కృష్ణయ్య

ABN , Publish Date - Mar 22 , 2026 | 06:15 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం చేసిందని, కామారెడ్డి డిక్లరేషన్‌కు తూట్లు పొడిచిందని ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు.

బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం: ఆర్‌.కృష్ణయ్య

బర్కత్‌పుర, మార్చి 21(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం చేసిందని, కామారెడ్డి డిక్లరేషన్‌కు తూట్లు పొడిచిందని ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించకపోతే మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నీల వెంకటేశ్‌ అధ్యక్షతన 14 బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ రూ.3 లక్షల 24 వేల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించి తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న 10 లక్షల మందికి సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి రూ.8 వేల కోట్లు అవసరం ఉండగా.. ఒక్క రూపాయీ కేటాయించలేదన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 06:15 AM