Share News

బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:27 AM

దేశంలో వెనుకబడిన వర్గాల(బీసీల) అభివృద్ధి కోసం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి

  • రాజ్యసభలో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): దేశంలో వెనుకబడిన వర్గాల(బీసీల) అభివృద్ధి కోసం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దేశ జనాభాలో సుమారు 56 శాతం ఉన్న బీసీల అభివృద్ధి కోసం కేంద్ర స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం సమంజసం కాదని అన్నారు. గురువారం రాజ్యసభలో జీరో అవర్‌లో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నప్పుడు జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల కోసం మంత్రిత్వ శాఖ ఎందుకు లేదని ప్రశ్నించారు. బీసీలకు జాతీయ బీసీ కమిషన్‌, బీసీ కార్పొరేషన్‌ ఉన్నప్పటికీ విద్యా, ఉపాధి రంగాల్లో అనేక న్యాయపరమైన వివాదాలు, సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బీసీల విద్య, ఆర్థిక, ఉపాధి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారానే వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోగలమని ఎంపీ ఆర్‌.కృష్ణయ్య తెలిపారు.

Updated Date - Feb 06 , 2026 | 04:27 AM