Share News

డ్రగ్స్‌ అంశంలో ఎవరినీ ఉపేక్షించం: మల్లు రవి

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:14 AM

డ్రగ్స్‌ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎంపీ మల్లు రవి అన్నారు. డ్రగ్స్‌ వ్యవహారంపై సర్కారు సీరియ్‌సగా ఉందని చెప్పారు.

డ్రగ్స్‌ అంశంలో ఎవరినీ ఉపేక్షించం: మల్లు రవి

  • నేతలు, ఆర్టిస్టులు డ్రగ్స్‌ టెస్ట్‌ చేయించుకోవాలి: అనిరుధ్‌రెడ్డి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎంపీ మల్లు రవి అన్నారు. డ్రగ్స్‌ వ్యవహారంపై సర్కారు సీరియ్‌సగా ఉందని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో డ్రగ్స్‌ కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్‌ ఉచ్చులో ఎవరూ చిక్కుకోవద్దని సూచించారు. డ్రగ్స్‌ మూలాలు సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఉన్నాయని, ప్రజా ప్రతినిధులతో పాటుగా సినీ ఆర్టిస్టులూ 90 రోజులకు ఒకసారి డ్రగ్స్‌ టెస్టు చేయించుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. ఇలా చేస్తేనే నటుల సినిమాలు రిలీజ్‌ చెయ్యాలని, నేతలను అసెంబ్లీకి అనుమతించాలని పేర్కొన్నారు. శాసనసభ లాబీల్లో మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Mar 17 , 2026 | 05:14 AM