Share News

MP Lakshman: కాంగ్రెస్‌ మనుగడ ప్రశ్నార్థకం: ఎంపీ లక్ష్మణ్‌

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:38 AM

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని బీజేపీ ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు.

MP Lakshman: కాంగ్రెస్‌ మనుగడ ప్రశ్నార్థకం: ఎంపీ లక్ష్మణ్‌

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని బీజేపీ ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌లు మాట్లాడుతున్న మాటలు గమనిస్తుంటే ఆ పార్టీ రోజురోజుకూ ఎలా పతనమవుతుందో తెలిసిపోతోందని ఆయన ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌ వాడిన ‘తులసివనంలో గంజాయి మొక్క’ అనే పదం ఇప్పుడు అక్షరాలా కాంగ్రె్‌సకే వర్తిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. సీపీఐ జాతీయ మహాసభల్లో ప్రధాని మోదీ, అమిత్‌షాలపై సీఎం చేసిన విమర్శలను ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీపీఐ ఇప్పటికే జాతీయ హోదా కోల్పోయిందని, త్వరలోనే కాంగ్రె్‌సకు కూడా అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు.

Updated Date - Jan 20 , 2026 | 02:38 AM