Share News

‘పాలమూరు’కు జాతీయ హోదా సాధ్యం కాదు

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:57 AM

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కాంగ్రెస్‌..

‘పాలమూరు’కు జాతీయ హోదా సాధ్యం కాదు

  • సీఎం రేవంత్‌ చెప్పేవన్నీ అబద్ధాలే: ఎంపీ డీకే అరుణ

కొందుర్గు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అవగాహన లేకుండా డిమాండ్‌ చేస్తున్నాయని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల పరిధిలోని రేగడి చిల్కమర్రి, ఉమ్మెంత్యాల, కొందుర్గులో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని ధ్వజమెత్తారు. 4,399రోజుల పాటు ప్రధానిగా సేవలు అందించడం ద్వారా మోదీ రికార్డు సృష్టించడం గొప్ప విషయమన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 04:57 AM