కాంగ్రెస్ గెలిచేవారికే టిక్కెట్లు ఇస్తే.. మునిసిపోల్స్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితమే!
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:01 AM
కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ఎన్నికల్లో గెలిచేవారికే టిక్కెట్లు ఇస్తే, బీఆర్‌ఎస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ఎన్నికల్లో గెలిచేవారికే టిక్కెట్లు ఇస్తే, బీఆర్‌ఎస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. బంధువులు, అనుచరులకు కాకుండా ప్రజల్లో ఆదరణ ఉన్నవారికే టిక్కెట్లు ఇవ్వాలని మంగళవారం ఓ ప్రకటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఫలాలు అందుకుంటున్న 70 శాతం మంది ప్రజలు మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తామే గెలుస్తామని కేటీఆర్, హరీ్‌షరావులు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సింగరేణి టెండర్లపై బీఆర్‌ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. గాంధీభవన్‌లో వెంకట్ మాట్లాడుతూ సింగరేణి స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని, ప్రతి నిర్ణయం మంత్రి మండలి వద్దకు రాదని ఆయన స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన పరేడ్‌లో రాహుల్‌గాంధీకి మూడో వరుసలో కుర్చీ కేటాయించి అవమానించారని మాజీ ఎంపీ వి.హన్మంతరావు మండిపడ్డారు.