బండి సంజయ్‌కు చేతకానిది రేవంత్ రెడ్డి చేసి చూపించారు
ABN , Publish Date - May 06 , 2026 | 07:02 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌కు చేతకాని పని.. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ చేసి చూపించారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.
భువనగిరి ఎంపీ చామల
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌కు చేతకాని పని.. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ చేసి చూపించారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌పై పోరాడి ఆయన్ను గద్దె దించడం గేమ్‌చేంజర్ అని, సీఎం రేవంత్‌రెడ్డి పాపులారిటీని ఓర్వలేక బండి సంజయ్ విమర్శలు చేస్తున్నారని మంగళవారం ఓ ప్రకటనలో చామల పేర్కొన్నారు.