Share News

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:33 PM

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కా లర్‌షిప్‌లు తక్షణమే విడుదల చేయాలని కోరు తూ బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో అసెంబ్లీ ము ట్టడికి పిలుపునివ్వడంతో జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులను పోలీసలుఉ సోమవారం ఎ క్కడికక్కడ అరెస్టు చేశారు.

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నరేష్‌చారితో పాటు బీజేపీ నాయకులను అరెస్టు చేసిన కల్వకుర్తి పోలీసులు

- అరెస్టు అయిన బీజేపీ, బీజేవైఎం నాయకులు

నాగర్‌కర్నూల్‌ క్రైం/ కల్వకుర్తి/ తెలకపల్లి/ ఉ ప్పునుంతల/ చారకొండ/ పెద్దకొత్తపల్లి/ తాడూ రు/లింగాల/ వెల్దండ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యో తి) : విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కా లర్‌షిప్‌లు తక్షణమే విడుదల చేయాలని కోరు తూ బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో అసెంబ్లీ ము ట్టడికి పిలుపునివ్వడంతో జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులను పోలీసలుఉ సోమవారం ఎ క్కడికక్కడ అరెస్టు చేశారు. బీజేవైఎం జిల్లా అ ధ్యక్షుడు దన్నోజు నరేష్‌చారితో పాటు మరికొంత మందిని కల్వకుర్తి పోలీసులు అరెస్టు చేసి పోలీ స్‌ స్టేషన్‌కు తరలించారు. నాగర్‌కర్నూల్‌ పట్ట ణంలో పట్టణ అధ్యక్షుడితో పాటు బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా తిమ్మాజిపేట అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ మండలాల్లో బీజేవైఎం, బీజేపీ నాయకులను అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఎ క్కడికక్కడా కట్టడి చేసి పోలీస్‌ స్టేషన్‌లకు తర లించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపైన వారిని విడుదల చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులో ఉద్యమాలను ఆపలేరని, విద్యా ర్థుల హక్కుల కోసం బీజేపీ పో రాడుతుందన్నారు.

ఫ తెలకపల్లిలో బీజేపీ మం డల అధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ అధ్యక్షుడు న రేందర్‌ చారి, సీనియర్‌ నాయకు లు బాబుసాగర్‌, మండల ఉపా ఽధ్యక్షులు ఈర్లపల్లిశ్రీనివాస్‌, మం డల ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌, నాయకులు రాజు, రాము, బాను, భాస్కర్‌ గౌడ్‌ తదితరులను పో లీసులు అరెస్టు చేశారు.

ఫ ఉప్పునుంతలలో బీజేపీ మండల అధ్యక్షుడు మహేశ్‌, కి సాన్‌ మోర్చా జిల్లా కార్యదర్శి ఏళ్ల సురేందర్‌ రెడ్డి, మండల ఉపాధ్య క్షుడు శివశంకర్‌, బీజేవైఎం రాజు, ఎల్లయ్య యాదవ్‌, పి.శేఖర్‌, శ్రీకాంత్‌, జగన్‌ ఉన్నారు.

ఫ చారకొండలో కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షు డు నారాయణ్‌ చంద్రారెడ్డి, వివిధ సంఘాల నా యకులు కామోజీ శ్రీకాంత్‌నాయీ, వెంకటేశ్‌ చా రి, హరిబాబు, పసుల శ్రీనివాస్‌, చిత్తారి రాము లు, శ్రీనివాస్‌యాదవ్‌, అంగోతు రవినాయక్‌, మోహన్‌, రామకృష్ణ, రామకృష్ణ ఉన్నారు.

ఫ పెద్దకొత్తపల్లిలో అరెస్టు అయిన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు దేశమోని పరశురాం, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి తిరుమల్‌యాదవ్‌, నాయకులు గుజ్జరి మార్కండేయ, బద్దుల ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌, గడ్డమీది రాముడు, అమ్మపల్లి మల్లేష్‌ పాల్గొన్నారు.

ఫ తాడూరులో జిల్లా మీడియా ఇన్‌చార్జి బొడ్డుపల్లి నారాయణ, బాలస్వామి, శ్యాంసుం దర్‌, తీగల శ్రీనివాసులు, మాధవులు, గోపాల్‌, సతీష్‌, రాందాస్‌, రవి, పిట్టల వెంకటేశ్‌ ఉన్నారు.

ఫ లింగాలలో బీజెవైఎం అతినారపు సాయిసాగర్‌, ఓబీసీ మండల అధ్యక్షుడు పిట్ల హేమంత్‌ కుమార్‌, బీజేపీ సినియర్‌ నాయకులు శంకర్‌ నాయక్‌, విష్ణుచారి, మహేష్‌ తదితరు లను పోలీసులు అరెస్టు చేశారు.

ఫ కల్వకుర్తి పట్టణంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు మొగిలి దుర్గాప్రసాద్‌, బోడ నరసింహ, నరేష్‌చారి, బాబీదేవ్‌, పరశురాములు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని కల్వకుర్తి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఫ వెల్దండలో బీజేపీ మండల అధ్యక్షుడు కుర్మిద్ద యాదగిరి, నాయకులు గుద్దటి రామస్వామి, రవీందర్‌రెడ్డి, రవికుమార్‌, జంగయ్యగౌడ్‌, శివప్రసాద్‌, అరుణ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 11:33 PM