ఎన్‌హెచ్-63 పనుల్లో కదలిక...
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:36 PM
నిజా మాబాద్-జగిత్యాల-మంచిర్యాల జిల్లాల్లో ఎన్ హెచ్-63 విస్తరణ పనులపై అధికార యంత్రాం గం ముందుకే వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
-వేగం పుంజుకోనున్న రహదారి పనులు
-హై కోర్టులో కేసు ఉండగానే సన్నాహాలు..!
-విన్నపాలు పట్టించుకోవాలంటున్న బాధితులు
-భూములు ఇచ్చేందుకు ససేమిరా
మంచిర్యాల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): నిజా మాబాద్-జగిత్యాల-మంచిర్యాల జిల్లాల్లో ఎన్ హెచ్-63 విస్తరణ పనులపై అధికార యంత్రాం గం ముందుకే వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధాన మంత్రి కార్యాలయ సూచన మేరకు రోడ్డు ని ర్మాణానికి వీలుగా అటవీ, పర్యావరణ అనుమ తులు మంజూరుకాగా, టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించడమే మిగిలి ఉంది. ఈ క్ర మంలో రహదారి విస్తరణ పనులకు సంబం ధించి ఇప్పటికే మూడు సార్లు అలైన్‌మెంట్‌ను అధికారులు మార్చారు. దీంతో రహదారి కింద భూములు కోల్పోతున్న రైతులు తీవ్రంగా విబే ధిస్తున్నారు. జాతీయ రహదారిని విస్తరించేం దుకు కేంధ్రం గ్రీన్‌ఫీల్డ్ హై వే పేరిట పనులకు అనుమతులు మంజూరు చేసిన విషయం విఽధి తమే. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మీదుగా జగిత్యాల-మంచిర్యాల వరకు మొత్తం 148.6 కిలీమీటర్ల పొడవున్న 63వ జా తీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరిం చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిం ది. గతంలో ఉన్న రోడ్డును విస్తరించడంతో పా టు అనుకూలంగా లేనిచోట కొత్తగా నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన భూమిని సేకరించా లని నేషనల్ హైవే అథారిటీని ఆదేశించింది. అ ధికారులు తయారు చేసిన అలైన్‌మెంట్ ప్రకా రం నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఎన్‌హె చ్-44 నుంచి ప్రారంభమయ్యే రహదారి పలు గ్రామాల గుండా సాగుతూ జగిత్యాల జిల్లాలో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి రాయపట్నం వద్ద గోదావరి వంతెన మీదుగా జిల్లాలోకి అడుగిడు తుంది. జిల్లాలో గూడెం, లక్షెట్టిపేట నుంచి హా జీపూర్, ముల్కల్ల మీదుగా గాంధారి వనం వద్ద ఎన్‌హెచ్-363కి అనుసంధానం చేయనున్నారు.
కోర్టులో కేసు ఉండగానే...
ఎన్‌హెచ్-63 కోసం అధికారులు మూడు ద ఫాలుగా రూట్ మ్యాప్‌లో మార్పులు చేశారు. మొదటి అలైన్‌మెంట్ ప్రకారం కొందరు బడా బాబులకు నష్టం వాటిళ్లుతండటంతో వారి ఒత్తి డికి తలొగ్గి రెండో రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశా రు. అది లక్షెట్టిపేట నుంచి ముల్కల్ల వరకు పూ ర్తిగా నివాస గృహాల మీదుగా వెళ్తుంది. దీనివల్ల సామాన్య ప్రజానీకానికి తీరని నష్టం కలిగేలా ఉంది. అష్టకష్టాలు పడి నిర్మించుకున్న ఇళ్లు కూల్చివేతకు గురవుతుండటంతో ఆయా గ్రా మాల ప్రజలు సర్వే పనులను అడ్డుకోవడం, భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ పలు రకా ల ఆందోళనలు నిర్వహించారు. దీనికి స్పందిం చిన ఎన్‌హెచ్ అధికారులు మూడో రూట్‌మ్యా ప్‌ను సిద్ధం చేశారు. కొత్త అలైన్‌మెంట్‌తో జీవ నాధారామైన సాగు భూములను సేకరించేం దుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ అలై న్‌మెంట్ ప్రకారం లక్షెట్టిపేట మండలం మీదు గా గోదావరి నదికి సమాంతరంగా పంట పొ లాలు, చేల మీదుగా రహదారి నిర్మాణం జరగా ల్సి ఉంది. గతంలో ఈ ప్రాంత రైతులకు చెం దిన భూములు పెద్ద ఎత్తున శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గరయ్యాయి. మిగి లిన కొద్దిపాటి భూముల్లో వ్యవసాయం చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. మళ్లీ రహదా రి నిర్మాణం కోసం తమ భూములు సేకరిస్తుం డటంతో వారంతా ఆందోళనబాట పట్టారు. తమకు నష్టం కలిగించే రూట్‌మ్యాప్‌ను కేంధ్ర, రాష్ట్ర మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఉన్నతాధి కారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లే కపోవడంతో హై కోర్టును ఆశ్రయించగా, ప్రస్తు తం కేసు పెండింగ్‌లో ఉంది.
పనులు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ....
రైతుల పక్షాన వెల్గటూర్‌కు చెందిన న్యాయ వాది దోరిశెట్టి పోచయ్య హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం ఎన్ హెచ్-63 పనులు ఆపాలని డబ్ల్యూపీ నెం.35476/2024 ద్వారా డిసెంబరు 2024లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌హెచ్ అథారిటీ యాక్ట్ సెక్షన్ 3సీ ప్రకారం అధికా రులు విధానాలను అమలు చేయలేదని, రైతుల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోక పోవడాన్ని ధర్మాసనం తన తీర్పులో తప్పుబ ట్టింది. ఈ మేరకు ధర్మాసనం ఎన్‌హెచ్-63 ప నులు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఈ నెల 7వ తే దీన కలెక్టర్ కుమార్ దీపక్ హాజీపూర్ మండ లంలోని పోచంపహాడ్ శివారులో రోడ్డు పనుల ను సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభిం చారు. దీంతో బాధిత రైతులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై హై కోర్టులో రెండు వేర్వేరు కేసులు పెండింగ్‌లో ఉండగానే, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుండటం సమంజసం కాదని, ఈ విషయమై తామంతా కోర్టులోనే తేల్చుకుం టామని బాధిత రైతులు చెబుతున్నారు. మరో వైపు భూములు కోల్పోతున్న రైతులు కొందరికి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో పరిహారం అంద లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో రైతుల సమ స్యలు పరిష్కరించకుండానే పనులు చేపడతా రా...? అన్న సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి.
హై కోర్టులో కేసు పెండింగ్ ఉంది...
వొడ్నాల శ్యాంసుంధర్, పాత మంచిర్యాల
ఎన్-63 రహదారి పనులకు సంబంధించి హై కోర్టులో రైతుల పక్షాన రెండు కేసులు పెం డింగ్‌లు ఉన్నాయి. వాటిపై వాదోపవాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ర హదారి కింద భూములు కోల్పోతున్న బాధితు లకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అంద నేలేదు. ఈ నేపథ్యంలో రహదారి విస్తరణ పనులు ఎలా చేపడతారు..? అలా కాదని అధి కారులు ముందుకే వెళ్తామంటే కోర్టులోనే తేల్చుకుంటాం.
న్యాయ పోరాటం చేస్తాం....నాగిరెడ్డి రమాదేవి, సూరారం
బాధిత రైతుల ఆవేదన పరిగణలోకి తీసుకో కుండానే అధికారులు పనులు చేపట్టేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన మాకు అండగా నిలవాల్సిన అధికారులు...ఉన్న భూ ములను కూడా బలవంతంగా లాక్కుంటారా...? అధికారుల చర్యలు సంవత్సరాలుగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మాకు జీవనా ధారమైన భూములను ఇప్పటికైనా వదిలిపెట్టాలి.