kumaram bheem asifabad- ‘చేయూత’లో కదలిక
ABN , Publish Date - May 28 , 2026 | 10:55 PM
చేయూత పింఛన్ల మంజూరుపై అధికార యంత్రాం గంలో కదలిక మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 తెలం గాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూత న పింఛన్లు అందజేస్తామని చెప్పడంతో కొత్త పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా గ్రామాల్లో అనర్హుల జాబితాను సిద్దం చేయాలని అందుకు ప్రత్యేక గుర్తింపు సర్వే చేపడుతున్నారు. ఏళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో అర్హులైనవారు ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డారు.
- కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
- జిల్లాలో 22,472 కొత్త దరఖాస్తులు
చింతలమానేపల్లి, మే 28 (ఆంధ్రజ్యోతి): చేయూత పింఛన్ల మంజూరుపై అధికార యంత్రాం గంలో కదలిక మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 తెలం గాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూత న పింఛన్లు అందజేస్తామని చెప్పడంతో కొత్త పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా గ్రామాల్లో అనర్హుల జాబితాను సిద్దం చేయాలని అందుకు ప్రత్యేక గుర్తింపు సర్వే చేపడుతున్నారు. ఏళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో అర్హులైనవారు ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డారు. వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు పింఛన్లపై ఆశలు పెట్టుకు న్నారు. కానీ 2022 నుంచి అంటే దాదాపుగా మూడు, నాలుగేళ్లుగా కొత్తగా పింఛన్ల మంజూరు కాలేదు. దీంతో అర్హులు సైతం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ మేరకు ఇప్పటికే అర్హులైన వారు జిల్లాలో 22,472 మంది దరఖాస్తులు చేసుకోగా వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సంద ర్భంగా కొత్తగా అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో అర్హులైన వారు ఆశలు పెట్టుకున్నారు. దీంతో పాటు గ్రామాల్లో అనర్హుల పింఛన్లు పొందేవారు, మృతి చెందిన వారు, కొందరు అ్హత లేకున్నా దివ్యాంగుల సర్టిఫికెట్ పొంది పింఛన్లు పొందుతున్నవారు ఇలా ప్రత్యేక అనర్హుల సర్వే చేపట్టి బోగస్ పింఛన్లు పొందుతున్న వారిని తొలగించే అవకాశం ఉందని చెబుతున్నారు. అనంతరం పెండింగ్ కొత్త దరఖా స్తుల పరిశీలన అనంతరం పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- ప్రభుత్వం నుంచి..
ప్రభుత్వం నుంచి జూన్ 2 నుంచి అందించే కొత్త పింఛన్ల మంజూరుకు అనుసరించాల్సిన విధివిధా నాలపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. గతంలో వివిధ సందర్భాల్లో ఆయా కేటగిరీలల్లో చేసుకున్న ధరఖాస్తుల ఆధారంగానే ఇస్తారా..? లేకుంటే మళ్లీ కొత్తగా ధరఖాస్తులు స్వీకరిస్తారా అన్నది తెలువాల్సి ఉన్నది. కొన్ని మండలాల్లో మాత్రం ఎంపిడీవోలు ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మౌఖికంగా దరఖాస్తులు స్వీకరిం చాలని ఆదేశాలు ఉన్నట్లు చెబుతున్నారు. కార్యదర్శు లు ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దీంతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాల కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
జిల్లాలో ప్రస్తుత లబ్ధిదారులు ఇలా..
వృద్ధులు 22,084
వితంతువులు 20,894
దివ్యాంగులు 5,666
పైలేరియా 98
ఒంటరి మహిళలు 2,932
ఇతరులు 835