Share News

ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించండి

ABN , Publish Date - May 19 , 2026 | 11:11 PM

కొనుగోలు కేం ద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు త్వరగా త రలించే విధంగా చూడాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు.

ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించండి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

దండేపల్లి మే 19 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేం ద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు త్వరగా త రలించే విధంగా చూడాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. మంగళవారం మండలంలోని కన్నెపల్లిలో రెండు రైస్‌ మిల్లుర్లు మండల అధికారులతో కలిసి ఆ యన సందర్శించి అక్కడ పరిస్థితి పరిశీలించి అధికారు లకు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ రైస్‌ మిల్లుర్లు హమాలీల సంఖ్య పెంచి వెంట వెంటనే ధా న్యం ఆన్‌లొడింగ్‌ చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు కొనుగోలు కేం ద్రా లలో ధాన్యాన్ని కొనుగోలు చేసి తూకం వేసిన బస్తాల ను లారీల ద్వారా తరలించాలన్నారు. కొనుగోలు కేం ద్రాల వద్ద రైతులకు టెంటు సౌకర్యం, తాగునీరు ఏర్పా టు చేయాలన్నారు. రైతులు కూడా నాణ్యమైన ధాన్యం తీసుకవచ్చి ప్రభుత్వ మద్దతు పొందాల న్నా రు. కేంద్రాలలో లారీల కొరత లేకుండా చూ డాలని, గన్ని సంచులను అందుబాటులో ఉంచే విధంగా చూడాలన్నారు. ముందుగా మండలంలోని కోర్విచెల్మ కొనుగోలు కేంద్రా న్ని సందర్శించి అక్కడ ధాన్యం కుప్పలను పరిశీలించారు. ఆరబోసిన ధాన్యంను క్లీనర్‌ చేసి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్‌ మిల్ల ర్లు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు అన్ని వసతులు కల్పించి రైతుల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల న్నారు. ఆయన వెంట తాహసీల్దార్‌ రోహిత్‌ దేశ్‌పాండే, ఎంపీడివో జేఆర్‌ ప్రసాద్‌, వివిధ శాఖల అధి కారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 19 , 2026 | 11:11 PM