kumaram bheem asifabad- వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 10:22 PM
జనవరి 6 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు ట్రాఫిక్ నిబందనలు పాటించాలని కౌటాల సీఐ సంతోష్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పోలీసు స్టేషన్ నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు.
బెజ్జూరు/దహెగాం/పెంచికలపేట/సిర్పూర్(టి), జనవరి 6 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు ట్రాఫిక్ నిబందనలు పాటించాలని కౌటాల సీఐ సంతోష్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పోలీసు స్టేషన్ నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, తహసీల్దార్ రామ్మోహన్, ఎస్సై సర్తాజ్ పాషా తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కాగజ్‌నగర్‌రూరల్ సీఐ కుమారస్వామి అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా దహెగాం మండల కేంద్రంలోని ని పలు ప్రధాన వీధుల గుండా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వమించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ హెల్మె ట్ ధరించి వాహనాలు నడిపితే ప్రమాదాలు సంభవిస్తే ప్రాణాలకు రక్షణగా నిలుస్తుంద ని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై విక్రమ్, నాయకులు ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. పెంచికలపేట మండలకేంద్రంలోని పోలీసు స్టేషన్ నుంచి ప్రధాన వీధుల గుండా దివచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. ఈ ర్యాలీని కేజీబీవీ ఎస్‌వో కవిత జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంచందర్, పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సిర్పూర్(టి) మండలంలో భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం సీఐ సురేష్, ఎస్సై సురేష్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాని, వాహన పత్రాలు కలిగి ఉండాలన్నారు. నియమ నిబంధనలు తప్పని సరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.