Share News

వాహనదారులు నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:08 PM

వాహన దా రులు రమదారి భద్రత నిబంధనలను ఖచ్చితంగా పా టించాలని, గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని కలెక్టర్‌కుమార్‌ దీపక్‌ అన్నారు.

వాహనదారులు నిబంధనలు పాటించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

హాజీపూర్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : వాహన దా రులు రమదారి భద్రత నిబంధనలను ఖచ్చితంగా పా టించాలని, గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని కలెక్టర్‌కుమార్‌ దీపక్‌ అన్నారు. 99 రోజుల ప్రజా పాల న ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలం లోని వేంపల్లిలో గల జిల్లా రవాణా శాఖ కార్యా లయం ఆవరణలో అరైవ్‌ అలైవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన వై ద్య శిబిరానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. అరైవ్‌ అ లైవ్‌లో భాగంగా ఆటో, లారీల డ్రైవర్లకు వైద్య, కంటి ప రీక్షలు నిర్వహించామన్నారు. ఈ శిబిరంలో ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో దాదాపు 200 మంది డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించి అవసరం ఉ న్న వారికి మందులు, కంటి అద్దాలు అందిం చామ న్నా రు. రోడ్లపై ప్రయాణించే సమయంలో రక్షణ ముఖ్యమ ని, ప్రతి వాహనదారుడు లైసెన్స్‌ కలిగి ఉండాలనారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌, కారులో ప్రయాణించే వారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. వాహ నం నడిపే సమయంలో వేగ పరిమితి అనుస రించా లని, మద్యం సేవించి, ఫోన్‌లో మాట్లాడుతూ వా హనం నడపకూడదన్నారు. వాహనాలు నడిపే వారికి కంటి చూపు అత్యవసరమని, కంటి పరీక్షలు నిర్వహిం చిన వారిలో అవసరం ఉన్నవారికి శస్త్ర చికిత్సలు నిర్వ హిస్తామన్నారు. రోడ్డు ప్రమాదం అంటే ఒక కుటుంబా నికి జరిగే ప్రమాదమని తెలిపారు. 18 ఏళ్ల వయస్సు నిండని వారు వాహనాలు నడపవద్దని, ఒక వేళ నడిపి తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. అతి వేగం చాలా ప్రమాదకరమని, వేగం పరిమితిలో నిబం ధనలు పాటించినట్లయితే గమ్యస్ధానానికి సురక్షితంగా చేరుకోవచ్చన్నారు. ఈ కార్య క్రమంలో జిల్లా రవాణా అధికారి రంజిత్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 11:08 PM