Share News

బిడ్డా ఎక్కడున్నా లొంగిపో!

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:09 AM

బిడ్డా ఎక్కడున్నా లొంగిపో.. అడవిలో చేసేదేమీ లేదు.. వృద్ధాప్యంలోనైనా మా కు అండగా నిలబడు’ అం టూ మావోయిస్టు భాగ్య అలియాస్‌ కల్పన తల్లి ఎల్లవ్వ కన్నీళ్లతో వేడుకుంది....

బిడ్డా ఎక్కడున్నా లొంగిపో!

  • మావోయిస్టు భాగ్య తల్లి ఎల్లవ్వ వేడుకోలు

తొగుట, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ‘బిడ్డా ఎక్కడున్నా లొంగిపో.. అడవిలో చేసేదేమీ లేదు.. వృద్ధాప్యంలోనైనా మా కు అండగా నిలబడు’ అం టూ మావోయిస్టు భాగ్య అలియాస్‌ కల్పన తల్లి ఎల్లవ్వ కన్నీళ్లతో వేడుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రంగనబోయిన భాగ్య 2002లో మావోయిస్టు పార్టీలో చేరారు. అజ్ఞాతంలోకి వెళ్లిన నాటి నుంచి ఇప్పటివరకు భాగ్య ఇంటిముఖం చూడలేదని ఆమె తల్లి ఎల్లవ్వ విలపించారు. తొమ్మిదేళ్ల క్రితం చనిపోయిన తండ్రి నరసయ్య కడచూపునకు కూడా నోచుకోలేదని తెలిపారు. 24 ఏళ్ల క్రితం అడవిబాట పట్టిన బిడ్డ ఎప్పుడు ఇంటికి వస్తుందో అని ఆ తల్లి కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. భాగ్యపై తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది.

Updated Date - Mar 09 , 2026 | 04:09 AM