Share News

ఆటో-డీసీఎం ఢీ.. తల్లీ ఇద్దరు కొడుకుల దుర్మరణం

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:52 AM

డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న తల్లీ కొడుకులు మృత్యువాత పడ్డారు. యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలం బీఎన్‌ తిమ్మాపూర్‌ వాసి....

ఆటో-డీసీఎం ఢీ.. తల్లీ ఇద్దరు కొడుకుల దుర్మరణం

  • యాదాద్రి-భువనగిరి జిల్లా వడపర్తి శివారులో ఘటన

భువనగిరి రూరల్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న తల్లీ కొడుకులు మృత్యువాత పడ్డారు. యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలం బీఎన్‌ తిమ్మాపూర్‌ వాసి డొంకెన శ్రీనివాస్‌, కేతమ్మ (50) దంపతులు స్థానికంగా కిరాణా దుకాణం నడుపుతున్నారు. శ్రీనివాస్‌ గీత కార్మికుడు కాగా, ఆయన పెద్ద కొడుకు నరేశ్‌ (30) దివ్యాంగుడు. చిన్న కొడుకు సురేశ్‌ (28) యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో కాంట్రాక్టు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తూనే.. ఖాళీ సమయంలో ఆటో నడుపుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం ఆటోలో భువనగిరికి వచ్చిన తల్లీ కొడుకులు కిరాణం, వంట సామాగ్రి కొనుక్కుని సొంతూరికి బయలుదేరారు. వడపర్తి శివారులో ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టడంతో వారు ప్రయాణిస్తున్న ఆటో నుజ్జునుజ్జయింది. నరేశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన సురేశ్‌ను భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేశ్‌... సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మేడ్చల్‌-మల్కాజిరిగి జిల్లా ఉప్పల్‌ వద్ద కేతమ్మ మరణించారు.

Updated Date - Mar 10 , 2026 | 03:52 AM