బావిలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య..
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:48 PM
దంపతుల మధ్య ఏర్పడ్డ క లహాలు రెండు నిండు ప్రాణాల ను బలి తీసుకున్నాయి. క్షణికావేశంలో ఓ తల్లి తన ఆరేళ్ల కూతురిని నడుముకు కట్టుకుని ఆదివారం వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది.
ప్రాణం తీసిన..కుటుంబ కలహాలు
దండేపల్లి, ఆగస్టు 30 (ఆంధ్ర జ్యోతి): దంపతుల మధ్య ఏర్పడ్డ క లహాలు రెండు నిండు ప్రాణాల ను బలి తీసుకున్నాయి. క్షణికావేశంలో ఓ తల్లి తన ఆరేళ్ల కూతురిని నడుముకు కట్టుకుని ఆదివారం వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామం లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ చెందిన మెరుగు రజిత(28) అనే వివాహిత తన కూతురు అక్షిత (6)ను నడుముకు కట్టుకుని ఆ దివారం సాయంత్రం సమయంలో గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. లింగాపూర్ గ్రామానికి చెందిన రజితను జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఎనుగుమట్ల గ్రామా నికి చెందిన మెరుగు అంజన్నకు ఇచ్చి ఏడేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి అమ్మాయి అక్షిత(6)తో పాటు 18 నెలల బాబు బాబు ఉ న్నారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో నా లుగేళ్ల నుంచి రజిత లింగాపూర్‌లోని తన తల్లిదండ్రుల వద్ద పిల్లల తో ఉంటోంది. ఆటో నడుపుకుంటూ జీవిస్తున్త భర్త అంజన్న అప్పుడ ప్పుడు భార్య దగ్గరికి వచ్చిపోతుంటాడు. ఈక్రమంలో ఆదివారం ఉద యం అంజన్న లింగాపూర్‌కు వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన రజిత తన కూతురిని తీసుకుని వ్యవసాయ బా వి వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయ ప నులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన రజిత తల్లి ఇంట్లో ఉన్న అల్లుడు అంజన్నను తన కూతురు ఎక్కడ అని ప్రశ్నించగా స మాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి పారి పారిపోయాడు. అప్పటికే వ్యవసాయబావిలో మృతదేహాలు తేలుతున్నట్లు స్థానికుల ద్వారా తె లుసుకున్న రజిత తల్లి అక్కడకు వెళ్లి గమనించింది. అవి రజిత, అక్షి త మృతదేహాలుగా గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై గుండేటి రాజవర్దన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలు తీయించి పోస్టుమార్టం కోసం త రలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకు ని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.