Share News

తల్లి తర్వాత తల్లి అంగన్‌వాడీ టీచర్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:08 PM

చిన్న పిల్లలకు తల్లి తర్వాత త ల్లిలా చూసుకునేది అంగన్‌వా డీ టీచర్లే అని అచ్చంపేట ఎ మ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృ ష్ణ అన్నారు.

తల్లి తర్వాత తల్లి అంగన్‌వాడీ టీచర్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

- ఎమ్మెల్యే వంశీకృష్ణ

బల్మూరు/ లింగాల, అమ్రా బాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : చిన్న పిల్లలకు తల్లి తర్వాత త ల్లిలా చూసుకునేది అంగన్‌వా డీ టీచర్లే అని అచ్చంపేట ఎ మ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృ ష్ణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లా డారు. పిల్లల ఎదుగుదలకు తల్లులు పౌష్టికా హారం, ఆకుకూరలు, గుడ్లు తీసుకోవాలని సూ చించారు. అంగన్‌వాడీ టీచర్లకు కొత్త ఫోన్లను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్‌ శిరీష, ప్రాజెక్టు అధికారి ద మయంతి, ఎంపీడీవో రాఘవులు, ఉప తహసీ ల్దార్‌ కేశవులు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి, మండల కార్యదర్శి రాంప్రసాద్‌గౌడ్‌, మాజీ ఎంపీటీసీ ఖదీర్‌, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్‌తో పాటు ఇతర నాయకులు, ప్రజాప్రతిని ధులు లింగాల, ఉప్పునుంతల, బల్మూరు మండ లాల అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

ఫ లింగాల మండలం సూరాపూర్‌ గ్రామం లో సర్పంచ్‌ శేఖర్‌, లబ్ధిదారుతో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్ర మంలో పాల్గొన్నారు. నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మె ల్యే అన్నారు. అంతకుమందు ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకుడు భగవాన్‌జీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ గాయత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయ కులు రంగినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ మండ ల అధ్యక్షుడు నారాయణ గౌడ్‌, పూజారి వెంక టయ్య, చెంచటి శివ, విష్ణు, మల్లయ్య, నాగేశ్వర్‌ రావు, బాలాజీ, ముక్తార్‌ పాల్గొన్నారు.

ఫ అమ్రాబాద్‌ మండలం తెలుగు కస్తూర్బా గాంధీ విద్యాలయానికి రూ.54.50 లక్షలతో నిర్మించనున్న ప్రహరీ నిర్మాణానికి గురువారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ భూమి పూజ చేశారు. అదేవిధంగా పదర మండలంలో రాయలగండి కేజీబీవీలో 38.15 లక్షలతో నిర్మిం చనున్న అదనపు గదులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. కార్యక్రమంలో అచ్చంపేట వ్యవ సాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రజితమల్లేష్‌, వైస్‌ చైర్మన్‌ ఆర్‌.వెంకటయ్య, పదర ఎంఈవో రామ్‌రెడ్డి, కేజీబీవీల ఎస్‌వోలు శారద, ఉమా దేవి, డీసీసీ కార్యదర్శి ఎడ్ల ఆనంద్‌, అమ్రాబాద్‌, పదర మండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఎంఏ.రహీం, బి.మాణిక్యం, ఇప్పలపల్లి సర్పంచ్‌ ఆర్‌.గేమ్యానాయక్‌, కాంగ్రెస్‌ నాయకులు బాల్‌ లింగంగౌడ్‌, రేణయ్య, సంతోష్‌, సంబు వెంకట రమణ, జూలూరి సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 11:08 PM