ఉన్నత న్యాయస్థానాల్లో నిలవని మరణశిక్షలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:25 AM
కింది కోర్టులు విధించిన మరణశిక్షలు ఉన్నత న్యాయస్థానాల్లో నిలవడం లేదు. ట్రయల్ కోర్టుల్లో మరణశిక్షలు పడిన వారిలో అధిక శాతం మందిని సుప్రీంకోర్టు...
కింది కోర్టులు విధించిన మరణశిక్షలు ఉన్నత న్యాయస్థానాల్లో నిలవడం లేదు. ట్రయల్ కోర్టుల్లో మరణశిక్షలు పడిన వారిలో అధిక శాతం మందిని సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టులు నిర్దోషులుగా విడుదల చేస్తున్నాయి. పదేళ్లుగా నమోదైన వివిధ మరణశిక్ష కేసుల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా పనిచేసే క్రిమినల్ లా అడ్వకసీ సంస్థ విడుదల చేసిన స్క్వేర్ సర్కిల్ క్లినిక్ నివేదిక ప్రకారం.... ట్రయల్ కోర్టులు విధించిన చాలా కేసుల్లో మరణశిక్షలు ఉన్నత న్యాయస్థానాల్లో నిలవలేదు. 2016-2025 లెక్కల ప్రకారం ట్రయల్ కోర్టులు 822 కేసుల్లో 1,310 మరణ శిక్షలు విధించాయి. హైకోర్టులు 842 మరణశిక్షలను పరిశీలించి కేవలం 70 (8.31ు) శిక్షలను మాత్రమే సమర్థించాయి. 258 మరణశిక్షల్లో (30.64ు) ముద్దాయిలను నిర్దోషులుగా విడుదల చేశాయి. హైకోర్టులు సమర్థించిన 70 మరణశిక్షల్లో సుప్రీంకోర్టు ఒక్కటి కూడా సమర్ధించలేదని నివేదిక పేర్కొంది.