Share News

kumaram bheem asifabad-‘సర్‌’కు మరింత సమయం

ABN , Publish Date - Jul 17 , 2026 | 10:41 PM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ గడువును పది రోజుల పాటు పెంచుతూ భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) నిర్ణయం తీసుకుంది. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఎన్యూమరేషన్‌ ఫారాల స్వీకరణ ఈనెల 24వ తేదీకే పూర్తి కావాల్సి ఉండగా, ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలు సేకరించడంలో ఆలస్యమవుతోంది. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా అనుకున్న సమయంలో పూర్తికావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం ప్రక్రియ గడువును 10రోజులపాటు పొడిగిస్తూ సవరణ షెడ్యూల్‌ను రెండు రోజుల క్రితం ఈసీఐ విడుదల చేసింది.

kumaram bheem asifabad-‘సర్‌’కు మరింత సమయం
లోగో

- గడువు పెంచిన ఎన్నికల కమిషన్‌

- అప్పటిదాకా ఎన్యూమరేషన్‌ ఫారాల స్వీకరణ.. సవరణ షెడ్యూల్‌ జారీ

- 10న ముసాయిదా ఓటరు జాబితా

- సెప్టెంబరు 9 వరకు అభ్యంతరాల స్వీకరణ

- అక్టోబరు 12న తుది జాబితా

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ గడువును పది రోజుల పాటు పెంచుతూ భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) నిర్ణయం తీసుకుంది. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఎన్యూమరేషన్‌ ఫారాల స్వీకరణ ఈనెల 24వ తేదీకే పూర్తి కావాల్సి ఉండగా, ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలు సేకరించడంలో ఆలస్యమవుతోంది. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా అనుకున్న సమయంలో పూర్తికావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం ప్రక్రియ గడువును 10రోజులపాటు పొడిగిస్తూ సవరణ షెడ్యూల్‌ను రెండు రోజుల క్రితం ఈసీఐ విడుదల చేసింది.

బెజ్జూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)కు కేంద్ర ఎన్నికల సంఘం గడువును పొడిగించడంతో అటు అధికార యంత్రాంగం, ఇటు ఓటర్లు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తయి నప్పటికీ అవి తిరిగి బీఎల్‌వోల చేతికి అందడం కొంత ఆలస్యమవుతోంది. ఓటర్లు అందించిన ఫారాలను డిజిటలైజ్‌ చేస్తున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి) నియోజకవర్గాల్లో సర్‌ ప్రక్రియ ముమ్మరంగాగ కొనసాగుతోంది. మరోవైపు ఫారాలను పూరించడంలో కొన్నిచోట్ల ఓటర్లు ఇబ్బం దులు పడుతున్నారు. అయితే ముందుగా నిర్ణయిం చిన గడువు తేదీ సమీపిస్తుండడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. తాజాగా గడువును వచ్చే నెల 3వ తేదీ వరకు పొడగించడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం గడువును పెంచడంతో బీఎల్‌వోలకు మరింత సమయం దొరికింది.

- పొడిగింపు నేపథ్యంలో..

గడువు పొడిగింపు నేపథ్యంలో ఆగస్టు 10వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 9వ తేదీ వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతుంది. అలాగే అక్టోబరు 8వరకు అభ్యంతరాల పరిష్కారం కొనసాగుతుంది. అక్టోబరు 12న తుది ఓటరు జాబి తాను ప్రచురిస్తారు. కాగా 2002ఓటరు జాబితాలో వివరాలు లేనివారు ప్రస్తుత ఓటరు జాబితా వివరాలు పొందుపరిచి, ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబరు, ఫొటో జత చేసిబీఎల్‌వోలకు ఫారం అందజేయ వచ్చు. అలాంటి వారి పేరు కూడా ముసాయిదా ఓటరు జాబితాలో చేర్పిస్తారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి(ఈఆర్‌వో) నోటీసు జారీ చేసే హియరింగ్‌కు పిలుస్తారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 13రకాల గుర్తింపు ధ్రువీకరణ పత్రాలలో ఏదైనా ఒకదానిని చూపిస్తే ఓటరు తుది జాబితాలో పేరు చేరుస్తారు.

కొనసాగుతున్న డిజిటలైజేషన్‌..

జిల్లాలో ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ వందశా తం పూర్తయింది. జిల్లాలో మొత్తం 4,55,596 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 3,49,183 (76.64) శాతం మందికి సంబంధించిన ఫారాలు డిజిటలైజ్‌ అయ్యాయి. బెజ్జూరులో 75.65శాతం, చింతలమానేప ల్లిలో 83.94శాతం, దహెగాంలో 85.07శాతం, కాగజ్‌నగర్‌లో 74.83శాతం, కాగజ్‌నగర్‌ (అర్బన్‌)లో 61.10శాతం, కౌటాలలో 80.87శాతం, పెంచికలపేట లో 82.46శాతం, సిర్పూర్‌(టి)లో 80.2 8శాతం, ఆసి ఫాబాద్‌లో 74.31 శాతం, గాదిగూడలో 76.58శాతం, జైనూరులో 75.17 శాతం, కెరమెరిలో 76.65శాతం, లింగాపూర్‌లో 79.89శాతం, నార్నూర్‌ లో 75.37 శాతం, రెబ్బెనలో 84.22శాతం, సిర్పూర్‌ (యు)లో 81.34శాతం, తిర్యాణిలో 79.24శాతం, వాంకిడిలో 78.80శాతం పూర్తయింది.

Updated Date - Jul 17 , 2026 | 10:41 PM