Share News

kumaram bheem asifabad- ఆమెకు మరింత చేయూత

ABN , Publish Date - Jun 12 , 2026 | 10:27 PM

మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తోంది. మహిళా సంఘాలకు విద్యార్థుల ఏకరూప దుస్తులు కుట్టే బాధ్యతలను అప్పగించింది. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రోత్సహిస్తోంది. మహిళా క్యాంటీన్లు, కోళ్ల పెంపకం, పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు ప్రాధాన్యమి

kumaram bheem asifabad- ఆమెకు మరింత చేయూత
లోగో

వాంకిడి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తోంది. మహిళా సంఘాలకు విద్యార్థుల ఏకరూప దుస్తులు కుట్టే బాధ్యతలను అప్పగించింది. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రోత్సహిస్తోంది. మహిళా క్యాంటీన్లు, కోళ్ల పెంపకం, పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తోంది. వీటితో పాటు మహిళలు ఎంచుకున్న రంగాల్లో ఆర్థికంగా తోడ్పాటు అందించేలా ప్రభుత్వ మరో నిర్ణయం తీసుకుంది. వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తుండగా వాటి పరిమితిని పెంచింది. ఇది అమల్లోకి వస్తే మహిళా సంఘాల సభ్యులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.

- కుటుంబ సభ్యులకు అండగా..

జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరుతున్నారు. కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ఆర్థిక అవసరాల కోసం సంఘం ఉందన్న భరోసా కల్గిస్తోంది. సంఘంలో చేరిన సభ్యులకు బ్యాంకు లింకేజీతో స్త్రీనిధి పథకం ద్వారా రుణాలు అందిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీతో తీసుకునే రుణంలో రూ. 5 లక్షల వరకే వడ్డీలేనిదిగా గుర్తిస్తారు. సభ్యులు చెల్లిస్తున్న వడ్డీ డబ్బును ప్రభుత్వం తిరిగి సంఘం ఖాతాలో జమ చేస్తోంది. ప్రస్తుతం ఆ పరిమితిని పెంచడం ద్వారా మహిళా సంఘాలకు మరింతగా ప్రయోజనం చేకూరనుందని అధికారులు చెబుతున్నారు.

- జిల్లాలో 386 గ్రామైక్య సంఘాలు...

జిల్లాలోని 15 మండలాల్లో 15 గ్రామ సమాఖ్య సంఘాలు ఉన్నాయి. 386 సంఘాల పరిధిలో స్వయం సహాయక పొదుపు సంఘాలు 8,158 ఉన్నాయి. వీటిలో 93,477 మంది సభ్యులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఇప్పటి వరకు రూ. 5 లక్షల వరకు మాత్రమే వడ్డీలేకుండా రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం దాని పరిమితిని రూ. 10 లక్షల వరకు పెంచుతున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంతి సీతక్క వెల్లడించారు. ఇటీవల ఈ నెల 1న కుమరం భీం జిలాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రె డ్డి సైతం ప్రకటించారు. ఇది అమల్లోకి వస్తే సంఘాల సభ్యులు వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాలు మెరుగవనున్నాయి.

Updated Date - Jun 12 , 2026 | 10:27 PM