మండలాన్ని విడదీస్తే మరింత ఉద్యమం
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:57 PM
ఊర్కొండ మం డలాన్ని కల్వకుర్తి డివిజన్‌లోనే కొనసాగించాలని, లేకపోతే మ రింత ఉద్యమిస్తామని జేఏసీ నాయకులు అన్నారు.
- రాస్తారోకో చేసిన రిలే దీక్షపరులు
ఊర్కొండ, జనవరి 14 (ఆంధ్రజ్యోతి) : ఊర్కొండ మం డలాన్ని కల్వకుర్తి డివిజన్‌లోనే కొనసాగించాలని, లేకపోతే మ రింత ఉద్యమిస్తామని జేఏసీ నాయకులు అన్నారు. ఐదు రో జులుగా రిలే దీక్షలు కొనసాగు తున్నాయి. దీక్షలో భాగంగా బు ధవారం ఐదవ రోజు జేఏసీ నా యకులు కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదా రిపై బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యకుడు నిరంజ న్‌గౌడ్ ఆధ్య్రంలో రాస్తారోకో నిర్వహించారు. వా హనదారులతో పాటు ప్రయాణికులకు ఇబ్బం దులు కలుగుతున్నందున కల్వకుర్తి సీఐ నాగా ర్జున, ఎస్‌ఐ కృష్ణదేవ చేరుకొని నిరసనకారు లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించా రు. అనంతరం వారిని సొంతపూచీకత్తుపై విడు దల చేశారు. కార్యక్రమానికి కల్వకుర్తి జేఏసీ నాయకులు సదానందంగౌడ్, డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ కళాభవన్ పరిరక్షణ సమితి చైర్మన్ సింగిరెడ్డి పరమేశ్వర్, బహుజన శోభాయాత్ర ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రమేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు రాధాకృష్ణ, బీజేపీ నాయకులు తాడెం చిన్నా సంఘీభావం ప్రకటించారు. రిలే దీక్షలో శ్యాంసుందర్‌రెడ్డి, నరేందర్ గౌడ్, బుడు మ జంగయ్య, వెంకటేష్, శివ, జంగయ్య, అర వింద్‌గౌడ్, నారాయణ్‌రెడ్డి ఉన్నారు.