Share News

కేజీబీవీలకు మరిన్ని మౌలిక సదుపాయాలు

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:46 PM

జిల్లాలోని కేజీబీవీల్లో మ రిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అ న్నారు. గురువారం కేజీబీవీల స్పెషల్‌ ఆఫీసర్లకు, మోడల్‌ స్కూల్‌ గర్ల్స్‌ హాస్టల్‌ వార్డెన్‌లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కేజీబీవీలకు మరిన్ని మౌలిక సదుపాయాలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలక్రైం, జనవరి8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కేజీబీవీల్లో మ రిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అ న్నారు. గురువారం కేజీబీవీల స్పెషల్‌ ఆఫీసర్లకు, మోడల్‌ స్కూల్‌ గర్ల్స్‌ హాస్టల్‌ వార్డెన్‌లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేజీ బీవీల బాలికలకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా భద్రత ను, భరోసాను ఇచ్చే ప్రదేశాలు అన్నారు. కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్లకు ప్ర తివిద్యార్థిని కనిపెట్టుకొని ఉంటూ వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉం టుందన్నారు. విద్యకు ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుందని కేజీ బీవీలకు అన్ని రకాలుగా అండగా ఉంటుంద న్నారు. ప్రతీ ఒక్కరు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ నేర్చుకున్న అంశాలను పాఠశాలలో అమలు చేస్తూ బాలికలకు మెరుగైన విద్యను అందించే ప్ర యత్నం చేయాలన్నారు. ఈసందర్భంగా జిల్లా విద్యాధికారి యాదయ్య తో కలిసి స్పెషల్‌ ఆఫీసర్లు వేసిన బాలిక విద్యపై గురించి నాటికను ఆ యన తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్లు భరత్‌, విజ యలక్ష్మి, సత్యనారాయణమూర్తి, నిర్మల్‌ కోఆర్డినేటర్‌ నవీన జ్యోతి, అసి స్టెంట్‌ కోఆర్డినేటర్‌ రమాదేవి, మాస్టర్‌ ట్రైనర్‌ జ్యోతి, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు చెందిన స్పెషల్‌ ఆపీసర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 11:46 PM