Share News

నెలాఖరులోపు మరిన్ని నిధులు

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:39 AM

పాలకవర్గాలు లేక గ్రామాలకు నిధులు రాలేదని, నెలన్నర కాలంలో పెద్దఎత్తున నిధులు విడుదలయ్యాయని, ఈనెలాఖరులోపు మరిన్ని నిధులు వస్తాయని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

నెలాఖరులోపు మరిన్ని నిధులు
సూర్యాపేటలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), మార్చి 12 (ఆంరఽధజ్యోతి): పాలకవర్గాలు లేక గ్రామాలకు నిధులు రాలేదని, నెలన్నర కాలంలో పెద్దఎత్తున నిధులు విడుదలయ్యాయని, ఈనెలాఖరులోపు మరిన్ని నిధులు వస్తాయని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మునిసిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌ లకు జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహించిన ఒకరోజు శిక్షణలో మాట్లాడారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కొంత సమయాన్ని ప్రజల కోసం కేటాయిస్తే క్షేత్రస్థాయిలో మంచి మార్పు కనిపిస్తుందన్నారు. ప్రతి గ్రామానికీ జనాభా ఆధారంగా రూ.5లక్షల నుంచి రూ.60 లక్షల వరకు నిధులు విడుదల అయ్యాయన్నారు. కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌పవార్‌, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్‌పద్మావతిరెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమే్‌షరెడ్డి, ఎస్పీ కొత్తపల్లి నరసింహ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్‌, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, మార్కెట్‌ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి, జడ్పీ సీఈవో శిరీష, సీపీవో కిషన్‌నాయక్‌, డీపీవో యాదగిరి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ పెండెం వెంకటరమణ, డీఏవో శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

కోదాడటౌన్‌: ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వక్ఫ్‌ బోర్డు మాజీ చైర్మన్‌ జబ్బార్‌ గురువారం కోదాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పాల్గొన్నారు. ముస్లింల షాదీఖానాకు రూ.3కోట్లు, ఈద్గాకు రూ.2కోట్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ మల్లీశ్వరి, మాజీ సర్పంచులు ఎర్నేని బాబు, పారా సీతయ్య, అల్తాఫ్‌ హుస్సేన్‌, చింతల పాటి శ్రీనివాస్‌, ఈదుల కృష్ణయ్య, బాగ్ధాద్‌, బాజాన్‌, షాబుద్దీన్‌, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్‌ వాజీద్‌అలీ, డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి, సీఐ శంకర్‌నాయక్‌, కమిషనర్‌ రమాదేవి పాల్గొన్నారు.

మోడల్‌ కాలనీ పనులు వేగవంతం చేయాలి

హుజూర్‌నగర్‌: మోడల్‌ కాలనీ పనులు వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. హుజూర్‌నగర్‌లోని ఫణిగిరి గట్టువద్ద మోడల్‌ కాలనీ ఇళ్లను కలెక్టర్‌ తేజస్‌నంద్‌లాల్‌పవర్‌, ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే పేదలకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, మునిసిపల్‌ చైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:39 AM