మూసీ ప్రాజెక్టుతో 1,435 కుటుంబాలు నిర్వాసితం
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:48 AM
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో 1,435 కుటుంబాలు నిర్వాసితమవుతాయని, న్యాయపరమైన పరిహారం, పునరావాస హక్కు చట్టం, 2013 ప్రకారం భూసేకరణ, సహాయ పునరావాసాలు ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
ఆర్‌ఎఫ్‌సీటీఎల్‌ఏఆర్‌ఆర్ చట్టం, 2013 ప్రకారం భూసేకరణ, పరిహారం: సీఎం
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో 1,435 కుటుంబాలు నిర్వాసితమవుతాయని, న్యాయపరమైన పరిహారం, పునరావాస హక్కు చట్టం, 2013 ప్రకారం భూసేకరణ, సహాయ పునరావాసాలు ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు డీపీఆర్, అంచనా వ్యయం, నిర్వాసిత కుటుంబాల సంఖ్యపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బుధవారం సీఎం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం అందించారు. ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం చేశామని, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. మొదటి దశలో ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 6,500 కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు ఉంటుందని వివరించారు. జనవరి 16న బఫర్‌జోన్‌లోని కుటుంబాలకు టీడీఆర్ జారీ చేశామన్నారు.