మాన్‌సూన్....ఏదీ ప్లాన్..!
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:17 PM
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నాలాలపై అక్రమ నిర్మాణాలు యథేశ్ఛగా వెలుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అసలే వర్షాకాలం కావడంతో నాలాలు కబ్జాలతో నిండిపోయి వర్షపు నీరంతా రోడ్లపై ప్రవహిం చే అవకాశాలు అనేకం ఉన్నాయి.
-వాన నీరుపోయే దారికి అడ్డుకట్ట
-నాలాలపై వెలిసిన అక్రమ నిర్మాణాలు
-ముందస్థు ప్రణాళికలేని నగరపాలక సంఘం
-భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యే ప్రమాదం
మంచిర్యాల, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో నాలాలపై అక్రమ నిర్మాణాలు యథేశ్ఛగా వెలుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అసలే వర్షాకాలం కావడంతో నాలాలు కబ్జాలతో నిండిపోయి వర్షపు నీరంతా రోడ్లపై ప్రవహిం చే అవకాశాలు అనేకం ఉన్నాయి. గతంలో నాలాలు నిండి రోడ్డన్నీ జలమయమైన సంఘటనలు జిల్లా కేంద్రంలో అనేకం ఉన్నాయి. గత అనుభవాల దృష్ట్యా కూడా మునిసిపల్ పాలక వర్గం పాఠాలు నేర్వకపోవడం శోచనీయం. ఓ వైపు వర్షాకాలం ప్రారంభ మైనా... ఇప్పటి వరకు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ’మాన్‌సూన్ (వర్షాకాలం) ఏదీ ప్లాన్’ అన్న చర్చ జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రంలో ప్రతీ వానాకాలం రోడ్లన్నీ బురదమయం కావడం ఆన వాయితీగా వస్తోంది. నాలాలు పూడుకపోవడమే దీనికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.
ముందస్తు ప్రణాళిక ఏది...?
వర్షాకాలం ప్రారంభం కాకముందే నాలాలపై నగరపాలక సం ఘం దృష్టి సారించి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉం డదు. జూన్‌లో మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన నాలా ల్లో చెత్త, పిచ్చి మొక్కలు తొలగించాల్సి ఉండగా, పాలక వర్గం ఆ దిశగా దృష్టిసారించలేదని తెలుస్తోంది. దీంతో భారీ వర్షం కురిస్తే అవి నిండి నీరుపోయే దారిలేక వీధుల్లోకి చేరే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా బైపాస్‌రోడ్డు, హమాలివాడ, గౌతమీనగర్, జాఫర్‌నగర్, పాత మంచిర్యాల, రాంనగర్ ప్రాంతాల్లో ముందస్తు చర్య లు చేపట్టవలసి ఉంది. ఆయా ప్రాంతాల్లో వర్షాకాలంలో నాలాల్లో నీరు రోడ్లపైకి చేరి, బురదమయంగా మారుతుంటాయి. భారీ వ ర్షం కురిసినప్పుడు ఆయా ఏరియాల్లో ఇండ్లలోకి నీరు చేరిన దా ఖలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంకూడా వర్షపు నీరు ఇండ్లలోకి చేరడానికి మార్గం ఏర్పడుతోంది.
ఆక్రమణలకు గురువుతున్న నాలాలు...
మంచిర్యాల నగరంలోని ప్రధాన నాలాలు కబ్జాలకు గురవుతూ నే ఉన్నాయి. ప్రధాన వీధులైన కూరగాయల మార్కెట్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, రాంనగర్, ఐబీ ప్రాంతం, బెల్లంపల్లి చౌరస్తా ఏరియా, బైపాస్ రోడ్డులలో దాదాపుగా అన్ని నాలాలు ఆక్రమణలకు గురయ్యాయి. నాలాలను ఆక్రమించుకొని వాటిపై శాశ్వతం గా షెడ్లు నిర్మించుకొన్న ఘటనలు నగరంలో కోకొల్లలుగా ఉన్నా యి. అలాగే బైపాస్ రోడ్డులో పెద్ద డ్రైనేజీపై ఐదారు చోట్లా ఏకం గా ఆర్‌సీసీ స్లాబులు నిర్మించడం గమనార్హం. అదే నాలాపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఏకంగా కార్ షెడ్ నిర్మించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మార్కెట్‌రోడ్డులో బడా షాపింగ్ మాల్స్ ఎదుట మెట్లు పూర్తిగా నాలాలపైనే నిర్మించడం గమనార్హం. మా ర్కెట్ రోడ్డులో పోలీస్ స్టేషన్ చౌరస్తా మొదలుకొని అర్చన టెక్స్ చౌరస్తా వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల మేర నాలా కనపడదంటే అతిశయోక్తికాదు. బడా షాపింగ్ మాల్స్ మెట్టు మొదలుకొని చిన్న పాన్‌షాపుల వరకు నాలాలపై ఏర్పాటు చేశారు. అయితే మార్కె ట్ రోడ్డును ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు కృషితో విస్తరణ చేపడు తుండగా, కబ్జాలకు గురైన నాలా ప్రస్తుతం బయట పడింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తుండటంతో భవిష్యత్తులో కబ్జాకు గురయ్యే అవకాశాలు దాదాపుగా లేవు. దీంతో ఆ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తకపోయినప్పటికీ, మిగతా ప్రాంతాల్లో మాత్రం యథావిది పరిస్థితులే ఉన్నాయి.
తొలగించిన కొద్ది కాలానికే మళ్లీ నిర్మాణాలు...
మంచిర్యాల జిల్లా కేంధ్రంగా ఏర్పాటవుతున్న సమయంలో దా దాపు పదేళ్ల క్రితం అప్పటి ఏఎస్పీ విజయ్‌కుమార్ నాలాల ఆక్ర మణలపై దృష్టి సారించారు. పట్టణంలోని ప్రధాన ఏరియాల్లో రా త్రింభవళ్లు జేసీబీ సహాయంతో అప్పటి మునిసిపల్ అధికారుల సహాయ, సహకారాలతో ఆక్రమణలను కూల్చివేయించారు. అయి తే కూల్చిన కొద్దికాలానికే మళ్లీ కబ్జాదారులు యథాతథంగా నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. ఈ కారణంగా కొద్దిపాటి వర్షానికే నాలాలు నిండి నీరంతా వీధుల్లోకి, ఇండ్లలోకి చేరడం జరుగు తోం ది. ఇప్పటికైనా మునిసిపల్ అధికారులు స్పందించి, నాలాలపై వె లసిన అక్రమ నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.