Share News

నిలిచిన నైరుతి.. 17 వరకు ఎండలే

ABN , Publish Date - Jun 11 , 2026 | 05:05 AM

రాష్ట్రానికి వచ్చిన నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణ- హైదరాబాద్‌ పరిధిలో నిలిచిపోయే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.

నిలిచిన నైరుతి.. 17 వరకు ఎండలే

రాష్ట్రానికి వచ్చిన నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణ- హైదరాబాద్‌ పరిధిలో నిలిచిపోయే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. జూన్‌ 17 వరకు ఉత్తర, ఈశాన్య తెలంగాణ వైపునకు ముందుకు కదలే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడటం వల్ల జూన్‌ 17 వరకు తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగనుందని హెచ్చరించారు. దీంతో ఉరుములు, మెరుపులతో కూడిన చెదురు ముదురు వర్షాలు కురుస్తాయని తెలిపారు. జూన్‌ 18 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావం వల్ల 19- 23 తేదీల మధ్య తెలంగాణలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్ని జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పులు ఉండవని తెలిపింది.

Updated Date - Jun 11 , 2026 | 05:05 AM