Share News

kumaram bheem asifabad- వానాకాలం.. జర పైలం

ABN , Publish Date - Jun 21 , 2026 | 10:01 PM

వర్షాకా లం ఎంత ఉల్లాసాన్ని ఇస్తుందో జాగ్రత్తలు పాటించక పోతే అంత విషాదాలను నింపుతుంది. ఇది వర్షాకాం.. ప్రమాదాలకు అస్కారం ఎక్కు వగా ఉన్న కాలం.. వానాకాలం సీజన్‌లో రైతులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా కరెంటు, పాములు, పిడుగుల రూపంలో ప్రమాదాలు పొంచి ఉంటాయి. వానాకాలంలో సహజం గానే పాములు, విషపురుగుల బెడద ఎక్కు వగా ఉంటుంది.

kumaram bheem asifabad- వానాకాలం.. జర పైలం
లోగో

వాంకిడి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): వర్షాకా లం ఎంత ఉల్లాసాన్ని ఇస్తుందో జాగ్రత్తలు పాటించక పోతే అంత విషాదాలను నింపుతుంది. ఇది వర్షాకాం.. ప్రమాదాలకు అస్కారం ఎక్కు వగా ఉన్న కాలం.. వానాకాలం సీజన్‌లో రైతులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా కరెంటు, పాములు, పిడుగుల రూపంలో ప్రమాదాలు పొంచి ఉంటాయి. వానాకాలంలో సహజం గానే పాములు, విషపురుగుల బెడద ఎక్కు వగా ఉంటుంది. వ్యవసాయ పనుల్లో తనమునకలై ఉండే రైతులు పాము కాటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలతో విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడం, తీగలు తెగిపోవడం వంటివి జరుగుతుంటా యి. అప్పుడప్పుడు పిడుగులు పడుతుంటా యి. రైతన్న అప్రమత్తంగా లేకపోతే అవి ప్రాణసంకటంగా మారుతాయి. వర్షాలకు బీడు భూములు ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, గడ్డి ఏపుగా పెరితుంది. దీంతో పాములు, విషపురుగులు బయటకు వచ్చి సంచరి స్తుంటాయి. ఈ క్రమంలో రైతులు వ్యవసాయ కూలీలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే వారు పంటపొలాలకు దగ్గర గా నివాస ప్రాంతాలున్న వారు అజాగ్రత్తగా ఉంటే పాముకాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

- సాగు పనుల్లో..

రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు పాము కాటు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు పొలంగ ట్లు, కాలువగట్లు, వాగులు, పశువుల పాకలు, పిచ్చిమొక్క లతో నిండిన పొదలు, గడ్డివా ములు, పాడుపడ్డ ఇళ్లు, పెంటకుప్పల్లో పాములు అధికంగా ఉంటాయి. పాముకా టుకు గురైనపుడు సకాలంలో వైద్యం అంద కపోతే ప్రణాపాయం ఉంటుంది.వానాకాలం పనులు జోరందుకున్న నేపథ్యంలో రైతులు దుక్కులు దున్నడం, కల్లిబేటర్‌ కొట్టడం, విత్తనాల సాళ్లు పెట్టడం తదితర పనులన్నీ ట్రాక్టర్లతోనే చేయిస్తున్నారు. వ్యవసాయ రంగంలో వీటి వినియోగం పెరిగింది. గతం లో రైతులు ఎద్దులు, నాగలి ఉపయోగించే వారు. ఇప్పుడు అందరూ ట్రాక్టర్లే వాడుతున్నా రు. ఈ క్రమంలో యంత్రాల వినియోగంలో అనుభవరాహిత్యము, అజాగ్రత్తతో ప్రమాదా ల బారిన పడుతూ రైతులు, ట్రాక్టర్‌ డ్రైవర్లు మృతి చెందున్నారు.

- విద్యుత్‌ ప్రమాదాలు..

వర్షాకాలం విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వర్షాలకు, గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడి విదుయత్‌ స్థంభాలునేలకూలడం, విద్యత్‌ తీగలు తెగిపడడం జరుగుతుంటాయి. ఈ సమయంలో వీటిని గమనించకపోతే ప్రాణా లు గాలిలో కలుస్తాయి. వ్యవసాయ క్షేత్రాల్లో స్తంభాలు వాలిపోయి ఉన్నా, తీగలు వేలాడు తున్నా వెంటనే విద్యుత్‌ సిబ్బందికి సమాచా రం అందించాలి. విద్యుత్‌ తీగలు వేలాడు తున్న ప్రదేశానికి పశువులు వెళ్లకుండా చూసుకోవాలి. మోటారు వద్ద వైర్లు నేలపై ఉండకుండా చూసుకోవాలి. పంపుసెట్‌కు తప్పనిసరి ఎంర్తింగ్‌ ఉండేలా చూడాలి. తడి చేతులతో మోటరు స్విచ్‌ వేయకుండా చూసు కోవాలి. ట్రాన్స్‌ఫార్మర్ల్‌ సమీపంలో వెళ్లకుండా వైర్లకు తాకుతున్న చెట్టు కొమ్మలను, విద్యుత్‌ స్తంభాలను ముట్టుకోవద్దు. దీంతో పాటు ఒక్కోసారి ఉన్నట్టుండి ఉరుముల, మెరుపు లతో కూడిన వర్షం వస్తుంది. ఇలాంటప్పుడు రైతులు, ప్రజలు తడవకుండా ఉండేందుకు చెట్ల కిందికి వెళ్తుంటారు. అయితే వర్షం కురుసే సమయంలో చెట్ల కింద ఉండడం మంచిది కాదు. పిడగులు ఎక్కువగా చెట్ల మీదే పడుతుంటాయన్న విషయాన్ని గమ నించి జాగ్రత్తలు తీసుకుంటే మేలు.

ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి..

- వైద్యాధికారి సత్యనారాయణ

వర్షాకాలంలో ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యవసాయ పనులు చేపట్టే సమయంలో పాములు తిరిగే ప్రదేశాల్లో రైతులు మోకాళ్లదాకా రబ్బరు బూట్లు, చేతులకు రబ్బరు తొడుగులు వేసుకోవడం ఉత్తమం. ఇళ్ల చుట్టు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టు పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యవసాయ పనుల్లో అనుభవం ఉన్న డ్రైవర్లతో ట్రాక్టర్లను నడిపించాలి. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్సఫా ర్మర్లు, తీగలు తగిలిఉన్న చెట్ల కొమ్మలు ము ట్టకుండా ఉండాలి. ఉరుములు మెరుస్తున్న ప్పుడు చెట్ల కింద నిలబడకుండా ఉండాలి. ఎలాంటి ప్రమాదం జరిగిన తక్షణమే వైద్యశా లకు వచ్చి చికిత్సలు చేయించుకోవాలి.

Updated Date - Jun 21 , 2026 | 10:01 PM