Share News

kumaram bheem asifabad- వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు

ABN , Publish Date - May 10 , 2026 | 10:28 PM

జిల్లాలో 2026 వానాకాలం సాగు ప్రణాళిక ఖరారైంది. జూన్‌ మొదటి వారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలుపడంతో అన్నదాతలు వానాకాలం పంట కోసం సన్నద్ధమవుతున్నా రు. ఇందు కోసం ఇప్పటి నుంచే వానకాలం సాగుకు అన్నదాతలు సిద్ధపడి దుక్కులు దున్నడం సేంద్రియ ఎరువులను పంట చేలలో వేయడం వంటి పనులు ప్రారంభించారు.

kumaram bheem asifabad- వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
లోగో

- 7.40 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం

- సరిపడా అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారుల చర్యలు

ఆసిఫాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2026 వానాకాలం సాగు ప్రణాళిక ఖరారైంది. జూన్‌ మొదటి వారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలుపడంతో అన్నదాతలు వానాకాలం పంట కోసం సన్నద్ధమవుతున్నా రు. ఇందు కోసం ఇప్పటి నుంచే వానకాలం సాగుకు అన్నదాతలు సిద్ధపడి దుక్కులు దున్నడం సేంద్రియ ఎరువులను పంట చేలలో వేయడం వంటి పనులు ప్రారంభించారు. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా వానాకాలం సాగు ప్రణాళికలను ఖరారు చేసింది. దీంతో వ్యవసాయాధికారులు పంట సాగుపై అంచనాలు రూపొందించారు. ఈ ఏడాది సాధారణానికి మించి పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారుల లెక్కలు వేశారు.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలోని 15 మండలాలలో ఈ వానకాలం సీజన్‌లో 4,52,202 ఎకరాల్లో వివిధ రకాల పంట లు సాగవుతాయని అంచనాలు వేశారు. ఈ మే రకు 7.40 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. సాధారణ సాగుకు మించి పంటలు సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లాలో ఈ మేరకు అంచనాలు వేసిన అధికారులు పంటల సాగుపై గ్రామాల వారీగా పట్టికలు రూపొందించారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం కంటే పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికా రులు లెక్కలు వేశారు. అయితే వీటిలో పత్తి 3,70, 919 ఎకరాలు, వరి పంట 42,228 ఎకరాలు,కంది పంట 20,817, సోయబీన్‌ పంట1,326 ఎకరాలు, మొక్కజొన్న 668 ఎకరాల్లో సాగవుతుందని అధికా రులు అంచనా వేశారు. అలాగే ఇతర పంటలైన జొన్న, పెసర, మినుములు, మిరప, వేరుశెనగ, అ ముదాలు, నువ్వులు 11,254 ఎకరాలలో సాగవుతా యని అధికారులు అంచనాలు రూపొందించారు.

- విత్తనాల కోసం..

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో పంట సాగు కు అంచనాలు వేసిన అధికారులు విత్తనాల కోసం ప్రభు త్వానికి నివేదికలు పంపారు. జిల్లాలో అరకొర సాగునీటి వసతితో రైతులు అధికంగా వర్షాదార పత్తి పంట వైపే ఆధార పడుతున్నారు. ఈ ఏడాది వానకాలం సైతం అధికంగా పత్తి సాగు చేసేందుకు రైతులు సన్నమద్దవుతున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం 4,52,202 ఎకరాల్లో ఉండగా ఇందులో మూడో వంతు పత్తిని సాగు చేయనున్న ట్లు అధికారులు అంచనాలు వేశారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాక పోవడం, ఉన్న ప్రాజెక్టుల కాలువలు మరమ్మతులకు నోచుకోక పోవడంతో వర్షాధార పంటలనే రైతులు ఆశ్రయిస్తు న్నారు. దీంతో జిల్లాలో మొత్తం విస్తీర్ణంలో అగ్రభాగం పత్తి సాగునే చేపడుతున్నారు. జిల్లాలో పత్తి పంట 3,70,919 ఎకరాల్లో సాగయ్యే అవకా శాలు ఉన్నట్లు అంచనాలు రూపొందించి నివేదిక లు పంపించారు. ఇందుకు గాను వానకాలం సీజన్‌ లో అయా ప్రైవేటు కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచనున్నా రు. జిల్లాలో 7,40,726 పత్తి విత్తన ప్యాకెట్లు 11,750 క్వింటాళ్ల వరి, 800 క్వింటాళ్ల కంది విత్త నాలు అవసరమని అంచనా వేశారు.

ఎరువులకు ప్రతిపాదనలు..

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో సాధారణ సాగుకు మించి పంటలు సాగవుతాయని అంచ నాలు రూపొందించిన అధికారులు జిల్లాకు అవస రమయ్యే ఎరువుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపారు. యూరియా 60,081 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 40.054 మెట్రిక్‌ టన్నులు, ఎంఓపీ 10,013 మెట్రిక్‌ టన్నులు,ఎస్‌ఎస్‌పి 20,027 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 20,027 మెట్రిక్‌ టన్నులు, జిల్లాకు కావాల్సిన ఇతర ఎరువులు కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపారు.

అంచనాలు రూపొందించాం..

- వెంకటి, జిల్లా వ్యవసాయాధికారి

వానాకాలం సాగుకు జిల్లాలో అంచనాలు రూపొందించాం. జిల్లాలో 4,52,202 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశాం. ఇందుకు గానూ ఇప్పటికే అన్ని మండల వ్యవసాయాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాం. మండలాల వారీగా ప్రతిపాదనలు తెప్పించుకుని దానికి అనుగుణంగానే ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేశాం.

Updated Date - May 10 , 2026 | 10:28 PM