Share News

kumaram bheem asifabad- వానరాల బెడద

ABN , Publish Date - Mar 30 , 2026 | 10:23 PM

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో వానరాల బెడద రోజురోజుకు పెరుగు తోంది. తరుచూ ఇళ్లలోకి చొరబడి వృద్ధులు, పిల్లలపై దాడులు చేస్తున్నాయి. వానరాలు గుంపులు గుంపులుగా కాలనీలపై విరుచుకు పడుతున్నాయి. ఇళ్లు, దుకాణాల లో తిను బండరాలు, వస్తువులను ఎత్తుకెళ్లడంతో పాటు పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులకు పాల్పడుతూ గాయపరుస్తున్నాయి. కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణలో కనీసం పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

kumaram bheem asifabad- వానరాల బెడద
ఆసిఫాబాద్‌ పట్టణంలో సంచరిస్తున్న కోతులు

- భయాందోళనలో ప్రజలు

- అధికారులు చర్యలు తీసుకోవాలని వినతి

ఆసిఫాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో వానరాల బెడద రోజురోజుకు పెరుగు తోంది. తరుచూ ఇళ్లలోకి చొరబడి వృద్ధులు, పిల్లలపై దాడులు చేస్తున్నాయి. వానరాలు గుంపులు గుంపులుగా కాలనీలపై విరుచుకు పడుతున్నాయి. ఇళ్లు, దుకాణాల లో తిను బండరాలు, వస్తువులను ఎత్తుకెళ్లడంతో పాటు పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులకు పాల్పడుతూ గాయపరుస్తున్నాయి. కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణలో కనీసం పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. కోతులు పట్టేందుకు ప్రత్యేక బృందాలు ఉంటాయి. వారికి ఒక్కో కోతికి కొంత డబ్బును పంచాయతీ వారు చెల్లించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో పంచాయతీ అధికారులు పెద్దగా దీనిపై శ్రద్ధ చూపడం లేదు. ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా పట్టించ కోవడం లేదు. జిల్లాలో ఎక్కడ కూడా మంకీ ఫుడ్‌ కోర్టులు లేక పోవడం, అడవుల్లో సరైన ఆహారం లభించక పోవడంతోనే గ్రామాల్లోకి వానరాల పెద్ద సంఖ్యలో చేరి హంగామా చేస్తున్నా యని ప్రజలు చెబుతున్నారు.

- బెదిరించే ప్రయత్నం చేస్తే..

ఇళ్లల్లోకి చొరబడుతున్న కోతులను బెదిరించే ప్రయత్నం చేస్తే మీదపడి కరుస్తున్నాయి. అటవీ ప్రాంతాలు రోజురోజుకు తగ్గి పోవడం వాటికి అడవిలో ఆహారం లభించక పోవడంతో గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. గుంపులుగుంపులుగా కాలనీలలో సంచరిస్తూ వీరంగం సృష్టిస్తున్నాయి. ఇళ్లలో తయా రు చేసుకున్న భోజనలతో పాటు పప్పు దినుసులు పట్టుకెళుతు న్నాయి. కిరణాషాపులు, పండ్ల దుకాణా ల దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపులోని వస్తువులకు రక్షణగా జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కోతుల బెడతతో పెంకుటిళ్లులు ధ్వంసం అవుతున్నాయి. అరుబయట ఎండబెట్టిన పప్పు దినుసులు ఇతర ఆహార పదార్థాలను వదలటంలేదు. ఇళ్లలో ఉన్న మామిడి, జామ, బొప్పాయి ఇతర పండ్ల చెట్లు, కూరగాయల చెట్లను సైతం వదలకుండ ధ్వంసం చేస్తున్నాయి.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లా కేంద్రంలోనే కాకుండా బెజ్జూరు, కెరమెరి, రెబ్బెన, సిర్పూర్‌(టి), కాగజ్‌నగర్‌ మండలాల్లోనూ కోతుల బెడత తీవ్రంగా ఉంది. కోతుల బెడద రోజు రోజుకు ఎక్కువ కావడంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. ఇళ్లలో చొరబడి వీరంగం సృష్టిస్తున్న కోతులను తరిమే ప్రయత్నంలో అవి ప్రజలపై దాడులకు దిగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కోతి కాటుకు గురై ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవు తున్నాయి. మిద్దెల మీద గుంపులుగుంపులుగా ఒక చోట చేరి వచ్చి పోయే వారిపై పైపైకి వచ్చి భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. కోతుల బెడద తీవ్రం కావడంతో కొంత మంది టపాసులు, పెద్ద శబ్దాలు చేసి వాటిని తరిమి వేస్తున్నారు. పట్టణంలో కోతుల నియంత్రణ కోసం అధికారులు తగిన చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కోతులను పట్టివేసి అటవి ప్రాంతాలకు తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కోతుల వల్ల చాలా ఇబ్బందులు పడాల్సిన పరస్థితి ఉందని, వాటి నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Updated Date - Mar 30 , 2026 | 10:23 PM