Share News

ఎన్నికల్లో ధన ప్రవాహం..

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:57 PM

రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఐదేళ్లకోసారి జరిగే సా ర్వత్రిక ఎన్నికల్లో స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం కల్పించింది.

ఎన్నికల్లో ధన ప్రవాహం..

-రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్టుకు అభ్యర్థుల తూట్లు

-ఈసీ నిబంధనల అమలులో చిత్త శుద్ధి కరువు

-టీ పోల్‌ యాప్‌తో అవినీతికి చెక్‌ పడేనా..?

మంచిర్యాల, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఐదేళ్లకోసారి జరిగే సా ర్వత్రిక ఎన్నికల్లో స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం కల్పించింది. త ద్వారా సరియైున నాయకున్ని ఎన్నుకొనే హక్కును ప్రజలకు రాజ్యాంగం కట్టబెట్టింది. రాజ్యాంగ బద్దంగా యో గ్యుడైన నాయకున్ని ఎన్నుకొని సుపరిపాలనకు నాంది పలకాల్సిన జనం ప్రలోభాలకు గురి అవుతున్నారు. అ భ్యర్థులు చూపే ఆశలకు లొంగుతూ అనేక మంది తమ ఇష్టాయిష్టాలకు భిన్నంగా ఓటు వేస్తున్నారు. ఈ క్రమం లో రాజ్యాంగం కల్పించిన హక్కు దుర్వినియోగం అవడమేగాక చట్ట సభల్లోకి అర్హతలేని వ్యక్తులు వస్తున్నారు. ఎన్నికలనగానే ధన ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. ఎన్నికల ద్వారా ఓట్లు సంపాదించాలనే క్రమంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో డబ్బు ప్రభావానికి తెరలేపుతున్నారు. నోటుకు ఓటు అనే చందంగా నేటి రాజకీయాలు తయారుకాగా అటు అభ్యర్థులు, ఇటు ఓటర్లు సైతం అందుకు తగ్గట్లుగానే వ్యవహరిస్తున్నారు.

రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్టుకు తూట్లు....

ఎన్నికల సమయంలో అభ్యర్థులు విపరీతంగా డబ్బు ఖర్చు చేయకుండా నిరోధించేందుకు రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్టు రూపొందించబడింది. 1951 రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్టు ప్రకారం ఎన్నికల కమిషన్‌ ని ర్దేచించిన మొత్తానికి లోబడి అభ్యర్థులు డబ్బు ఖర్చు చే యాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రస్తుత మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే కార్పొరేటర్‌ అభ్యర్థి అయితే రూ. 10 లక్షలు, కౌన్సిలర్‌ అభ్యర్థి అయితే రూ. 5 లక్షల వరకు ఖర్చు చేసేందుకు పరిమితిని ఖరారు చే సింది. అయితే ఎన్నికల్లో ఆ చట్టానికి తూట్లు పొడు స్తూ కొందరు అభ్యర్థులు ఇష్టారీతిన ఖర్చు చేస్తూ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. చట్టం ప్రకారం పోస్టర్లు, బ్యానర్లు, జెండాలు, హోర్డింగులు, ర్యాలీలు, స భల నిర్వహణ, వాహనాలు, మైకుల వాడకం తదితర కార్యక్రమాలన్నీ నిర్దేశించిన మొత్తానికి లోబడే జరగాల్సి ఉంది. అయితే ఇందుకు భిన్నంగా ప్రచారంలో డబ్బు పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. ప్రచారంలో భాగం గా డబ్బు, మద్యం, చీరలు, ఇతరత్రా బహుమతులు పంపిణీ చేస్తూ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు.

నిబంధనల అమలులో చిత్తశుద్ధి కరువు...

ఎన్నికల సమయంలో సంస్కరణల పేరిట ఎన్నికల కమిషన్‌ ఎప్పటికప్పుడు మార్పులు తెస్తున్నట్లు చెబుతుందేగానీ వాటి అమలులో చిత్తశుద్ధి కొరవడిందని, ఎ న్నికల విశ్లేషకులు బావిస్తున్నారు. చట్టంలో లొసుగుల ఆధారంగా రెడ్‌ హ్యాండెడ్‌గా డబ్బులు పంచుతూ పట్టుబడ్డ వారిపై కేసులు నిలిచిన దాఖలాలు లేవని పేర్కొంటున్నారు. ఆర్థికపర విషయాల్లో అభ్యర్థుల తీరు మారితేగానీ ఓటుకు నోటు విధానంలో మార్పు వచ్చే అవకా శం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఓటర్లను నేరుగా కలుస్తున్న అభ్యర్థులు ఆ క్రమంలోనే వారికి ఆశచూపుతున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. భారతీయ శిక్షా స్మృతి చట్టం 1860 సెక్షన్‌ 171 బీ ప్రకారం ఎన్నికల నియమావళిని అతిక్రమించిన అభ్యర్థులకు గరిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. విచారణలో చట్టాన్ని అతిక్రమించినట్లు రుజువైతే గెన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి సభ్యత్వం రద్దు కావడంతోపాటు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్ప టి వరకు దేశ చరిత్రలోనే అటువంటి శిక్షలు అమలు కాకపోవడం విశేషం.

ఫిర్యాదు చేయవచ్చు....

జిల్లా ఎన్నికల అధికారి కుమార్‌ దీపక్‌

ఏ ఎన్నికల్లోనైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయ డం చట్టరీత్యా నేరం. ఓటర్లను స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకొనేలా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క రిపై ఉంది. ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ధృష్టికి వస్తే ఎవరైనా సరే నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. రిటర్నింగ్‌ అఽధికారులు, పోలీస్‌ శాఖకు ఫిర్యాదు చేయలేని వారు నేరుగా టీ పోల్‌ యా ప్‌ ద్వారా సమాచారం అందిస్తే అవసరమైన చర్యలు ఉంటాయి. కలెక్టరేట్‌లో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయడం జరిగింది. 08736- 250501 నెంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

Updated Date - Feb 05 , 2026 | 11:57 PM