Share News

డ్రగ్స్‌ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:46 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో... బెయిల్‌ను అభ్యర్థిస్తూ నిందితులు తాండూరు బీఆర్‌ఎస్‌ మాజీ ...

డ్రగ్స్‌ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

మొయినాబాద్‌, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో... బెయిల్‌ను అభ్యర్థిస్తూ నిందితులు తాండూరు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, రితేష్‌ రెడ్డి, నమిత్‌శర్మలు వేసిన పిటిషన్‌ను మంగళవారం రాజేంద్రనగర్‌ కోర్టు కొట్టివేసింది. కేసు విచారణలో ఉండగా బెయిలు ఇవ్వడం వీలుకాదంది. ఇదిలాఉండగా నిందితుల పోలీసు కస్టడీ పిటిషన్‌పై రాజేంద్రనగర్‌ కోర్టులో మంగళవారం కూడా వాదనలు జరిగాయి. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని మరో ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీనిపై తీర్పును జడ్జి బుధవారానికి వాయిదా వేశారు.

Updated Date - Apr 08 , 2026 | 05:46 AM