డ్రగ్స్ కేసు నిందితులకు మరో సారి కస్టడీ
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:54 AM
మొయినాబాద్ ఫౌమ్‌హౌస్ డ్రగ్స్, కాల్పుల కేసులో నిందితులను మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం రాజేంద్రనగర్ కోర్టు తీర్పునిచ్చింది...
శంషాబాద్ రూరల్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మొయినాబాద్ ఫౌమ్‌హౌస్ డ్రగ్స్, కాల్పుల కేసులో నిందితులను మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం రాజేంద్రనగర్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మను మరో ఐదు రోజులపాటు విచారించేందుకు కస్టడీని పొడిగించాలని గత గురువారం పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఏప్రిల్ 3 తేదీ వరకు ముగ్గురిని పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో తొలుత 11మందిపై కేసు నమోదు చేయగా, తరువాత విచారణలో మరికొన్ని పేర్లు బయటకు వచ్చాయి. డ్రగ్స్ సరఫరాదారులు అభిషేక్ సింగ్, రాకేష్ వర్మ, క్లింటన్‌తో పాటు మరికొందరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.