Share News

డ్రగ్స్‌ కేసు నిందితుల కస్టడీ పిటిషన్‌ తిరస్కరణ

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:24 AM

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

డ్రగ్స్‌ కేసు నిందితుల కస్టడీ పిటిషన్‌ తిరస్కరణ

మొయినాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. నిందితులను ఇప్పటికే నాలుగు సార్లు కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులు మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని వేసిన పిటిషన్‌ను రాజేంద్రనగర్‌ న్యాయస్థానం తిరస్కరించింది. జైల్లో ఉన్న రోహిత్‌రెడ్డి, రితే్‌షరెడ్డి, నమిత్‌శర్మలకు బెయిల్‌ మంజూరు చేయాలని వేసిన పిటిషన్‌ విషయం గురువారం తేలనుంది. వీరు బెయిల్‌ కోసం గతంలో రాజేంద్రనగర్‌ కోర్టులో వేసిన పిటిషన్‌ను తిరస్కరించడంతో రెండు రోజుల క్రితం హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేశారు.

Updated Date - Apr 14 , 2026 | 05:24 AM